Andhra Pradesh: ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి ఇకపై 20 రోజుల సెలవులు

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు.. లేదా ఇంట్లో ఎవరైనా కరోనాతో బాధపడుతున్నా అలాంటి వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • Share this:
    కరోనా రక్కసి కాటుతో ఏపీ వ్యాప్తంగా పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు అని తేడా లేకుండా అందరి ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి. కేవలం వ్యాపారులే కాదు ఉద్యోగుల పరిస్థితి కూడా అంతే, ఇక ప్రైవేటు ఉద్యోగస్తులు, స్కూల్ టీచర్ల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్సాల్సిన పని లేదు. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నా.. ఇంకా భయాలు వీడకపోవడంతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం అవస్థలు ఎదుర్కొన్నారు. వారి కష్టాలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకితే సెలవులు మంజూరు చేసేందుకు కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్ సర్కార్. తాజాగా కరోనా సోకిన ఉద్యోగులకు 20 రోజుల సెలవు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌ సోకి ఆస్పత్రిలో ఉన్నవారికి, హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి కూడా ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభత్వం జీవోలో స్పష్టం చేసింది. దీనీపై ఉద్యోగుల సంఘం నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వస్తే 28 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని ఫెడరేషన్ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని.. కానీ కరోనా పాజిటివ్ ఉద్యోగులకు 20 రోజులు సెలవులు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి తెలిపారు.

    రెగ్యులర్, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరికి కరోనా వచ్చినా 20 రోజుల సెలవులు మజూరు చేస్తారన్నారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఉద్యోగి కుటుంబ సభ్యులకు కరోనా సోకినా.. వారికి 15 రోజుల సెలవు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. మార్చి 25 తర్వాత కోవిడ్‌ సోకిన ఉద్యోగులకు ఈ సెలవు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
    Published by:Nagesh Paina
    First published: