ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఇంటికే కరోనా క్వారంటైన్ కిట్... ఏముంటాయంటే...

కరోనా వచ్చిన వారు... తమకు ఏమేం కావాలే తమకే తెలియదు. అలాంటి సమయంలో... ప్రభుత్వం ఇస్తున్న క్వారంటైన్ కిట్... వారికి ఆశాజ్యోతిలా మారుతోంది.

news18-telugu
Updated: July 11, 2020, 12:23 PM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఇంటికే కరోనా క్వారంటైన్ కిట్... ఏముంటాయంటే...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఇంటికే కరోనా క్వారంటైన్ కిట్...
  • Share this:
దేశంలో అత్యధిక కరోనా శాంపిల్ టెస్టులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా... హోం క్వారంటైన్‌లో ట్రీట్‌మెంట్ పొందేవారి కోసం... హోమ్ క్వారంటైన్ కిట్‌ని ఫ్రీగా అందిస్తోంది. ఒక కిట్... ఒక కరోనా పేషెంట్‌కి ఉపయోగపడుతుంది. ఇందులో కరోనా పేషెంట్‌కి ఏమేం అవసరమో అవన్నీ సెట్ చేశారు. అందువల్ల ఇళ్లలో ట్రీట్‌మెంట్ పొందే పాజిటివ్ వ్యక్తులు... తమకు ఏమేం కావాలో... ఆ వస్తువుల కోసం ఆస్పత్రులు, మందుల షాపుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ప్రభుత్వమే స్వయంగా ఈ కిట్లను రెడీ చేసింది. ఎందుకంటే... కరోనా సోకగానే... ఆ వ్యక్తులు చాలా నీరసంగా అయిపోతున్నారు. అలాంటి సమయంలో... వారు బయట తిరుగుతూ కావాల్సినవి పొందడం కష్టమైన పని. ఆదీ కాక... వారు బయట తిరిగితే... మరింత మందికి కరోనా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రభుత్వ ఈ కిట్‌ను అందిస్తోంది.

రికార్డు స్థాయిలో టెస్టింగ్ జరుపుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే జిల్లాకి నాలుగు బస్సులను కరోనా నిర్థారణ టెస్టింగ్ కోసం ఏర్పాటు చేసింది. అలాగే జిల్లాకు రూ.కోటి ఇచ్చింది. ఇప్పుడు ఈ కోవిడ్ హోమ్ క్వారంటైన్ కిట్‌లను ఇస్తోంది. ఈ కిట్ స్వల్ప లక్షణాలతో ఉన్నవారికి మాత్రమే... లక్షణాల తీవ్రత పెరిగితే... వెంటనే వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్తారు. ఆ పరిస్థితి రాకుండా కరోనా తగ్గిపోయే అవకాశాలు ఉండటం వల్ల... ఇలా కిట్ ఇస్తోంది ప్రభుత్వం.

corona drug, corona vaccine, unlock2, lockdown6, extend the lockdown, corona update, fight with corona virus, covid19, కరోనా డ్రగ్, కరోనా మందు, కరోనా వ్యాక్సిన్, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్, అన్‌లాక్2,
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఇంటికే కరోనా క్వారంటైన్ కిట్...


హోం క్వారంటైన్ కిట్‌లో కరోనాను తగ్గించే టాబ్లెట్లు, చేతికి గ్లౌజులు, శానిటైజర్లు, మాస్కులు, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు, ఆక్సిజన్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో చెప్పే... పల్స్ ఆక్సీమీటర్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కలిపి... ఓ బ్యాగ్‌లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. దీన్ని తీసుకునే... కరోనా పాజిటివ్ వ్యక్తులు... ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంటూ... ఈ వస్తువుల్ని వాడుకుంటూ... త్వరగా కోలుకునేందుకు వీలుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కిట్ విధానాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 11, 2020, 12:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading