HOME »NEWS »Corona vilayatandavam »andhra pradesh government formed taskforce to distribute covid 19 vaccine prn

Andhra Pradesh: కరోనా వ్యాక్సిన్ పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏం చెప్పిందంటే..!

Andhra Pradesh: కరోనా వ్యాక్సిన్ పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏం చెప్పిందంటే..!
ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) కరోనా వ్యాక్సిన్ పై (Corona Vaccine) కీలక ఉత్తర్వులిచ్చింది. వ్యాక్సిన్ పంపిణీ కోసం నూతన టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది.

  • Share this:
    ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కొవిడ్ వ్యాక్యిన్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నారు. భారత్ లో కూడా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జనవరి నుంచి ప్రజలను వ్యాక్సిన్ వేస్తామని కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ ప్రకటింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ ఎవరెవరికి ముందు వేయాలి, ఎలా పంపిణీ చేయాలనే అంశంపై కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం.., గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విడివిడిగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

    పట్టణ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కసరత్తు కోసం అర్బన్ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌శాఖ కమిషనర్‌ ఛైర్మన్‌ 9 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఉత్తర్వుల్లో కొన్ని మార్పులు చేసింది. స్టేట్ టాస్క్ ఫోర్స్ లో మరో ఆరుగురు సభ్యులకు స్థానం కల్పించింది. జిల్లా టాస్క్‌ఫోర్స్‌ లో మరో 31 మంది అధికారులు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. కొత్త సవరణలతో స్టేట్ టాస్క్‌ఫోర్స్ సభ్యులుగా 16 మంది, జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ సభ్యులుగా 34 మందిని నియమిస్తున్నట్లు ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.



    రాష్ట్ర
    Published by:Purna Chandra
    First published:December 21, 2020, 18:08 IST

    टॉप स्टोरीज