Home /News /coronavirus-latest-news /

ANDHRA PRADESH CRIME NEWS GANG RAPE IN GUNTUR POLICE ARRESTED SUSPECTS NGS GNT

Woman Raped: సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు అరెస్ట్ అయ్యారా..? దర్యాప్తు పరిస్థితి ఏంటి..?

Gang rape

Gang rape

Gang rape case update: మహిళలు రోడ్డుపైకి రాకూడదా..? ఒంటరిగా వస్తే కామాంధులు వెంటాడుతున్నారు. అలాగని భర్తతో వచ్చినా వదలడం లేదు. తాజాగా జరిగిన ఓ గ్యాంగ్ రేప్.. ఆంధ్రాలో మహిళలకు రక్షణ లేదనే సంకేతాలను ఇస్తోంది.

    Woman gang-raped: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అత్యాచార ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఒంటరిగా మహిళ రోడ్డుపైకి వెళ్లాలి అంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థినిలు, పొలం పనికి వెళ్లేందుకు మహిళా రైతులు, బంధువులు ఇంటికి వెళ్లాలి అనుకున్న సాధారణ మహిళలు, స్కూల్స్, ట్యూషన్ల కు వెళ్లాలి అనుకునే చిన్నారులకు ఎవరికీ రక్షణ లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. అసలు ఒంటరిగా ఏంటి.. బంధువులు తెలిసిన వాళ్లతో కూడా మహిళ బయటకు వెళ్లాలి అంటే భయపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆఖరికి భర్తతో కలిసి వెళ్తున్న మహిళపైనా అత్యాచారం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళల రక్షణ కోసమే ప్రభుత్వం ఉందని చెప్పి.. కొత్త కొత్త చట్టాలు చేస్తున్నారు. అందుకోసం నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు చేసినా ఫలితం ఉండడం లేదు. రోజు రోజుకూ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా (Guntur district)లో దారుణం జరిగింది. ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

    అయితే బాధిత మహిళ అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ (Sattenaplli Police station) కు వెళ్లగా ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారు. ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోది కాదని గుంటూరు (Guntur) అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని సత్తెనపల్లి పోలీసులు తెలిపారు. తమ స్టేషన్ గుంటూరు రూరల్ పరిధిలో ఉందని పోలీసులు అన్నారు. దీంతో బాధితులు మేడికొండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం తామే స్వయంగా అక్కడికి పంపినట్లు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: మరోసారి పోలీసుల అదుపులో నారా లోకేష్.. గన్నవరంలో తీవ్ర ఉధ్రిక్తత

    పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరులో ఓ వివాహ వేడుకకు హాజరై బైక్ పై తిరిగి వస్తున్నారు. మార్గంమధ్యలో మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద బైక్ పై వస్తున్న దంపతులను దుండగులు అడ్డగించి, వారిపై దాడికి దిగారు. తరువాత వివాహితను సమీపంలోని పంట పొలాల్లోకి లాక్కెళ్లారు. కత్తులతో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

    ఇదీ చదవండి: వినాయక చవితికి కోవిడ్ ఆంక్షలు.. వైసీపీ నేతల రికార్డింగ్ డ్యాన్సుల సంగతేంటి? వీడియో చూడండి

    ఈ సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో జాగీలతో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన స్థలంలో గుంటూరు జిల్లా క్లూస్ టీమ్ వివరాలను సేకరించింది. ఘటనా స్థలిని డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు అనుమానితులను విచారిస్తున్నారు.

    ఇదీ చదవండి: ఈ నెల 15న జగన్ బెయిల్ రద్దుపై తీర్పు.. 16 సీఎం ప్లాన్ ఇదే.. ఏం జరగబోతోంది?

    మరోవైపు ఈ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. వారి నుంచి పూర్తి వివరాలు రాబెడుతున్నట్టు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని.. కేవలం నిందితులు, అనుమానితులను మాత్రమే విచారిస్తున్నామని చెబుతున్నారు..
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు