ఏపీలో మరింత తీవ్ర స్థాయిలో.. 132కు చేరిన కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఊహించనంత వేగంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్నటికి 111 కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 132 కు చేరింది.

news18-telugu
Updated: April 2, 2020, 11:12 AM IST
ఏపీలో మరింత తీవ్ర స్థాయిలో.. 132కు చేరిన కరోనా కేసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఊహించనంత వేగంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్నటికి 111 కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 132 కు చేరింది. ఈ రోజు కొత్తగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. కృష్ణాలో 15, గుంటూరులో 20, ప్రకాశంలో 17, కడపలో 15, చిత్తూరులో 8, విశాఖలో 11, అనంతపురంలో 2, నెల్లూరులో 20, కర్నూల్‌లో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం శుభసూచకం.
ప్రభుత్వం విడుదల చేసిన తాజా బులిటెన్

అటు.. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, క్రోసూరు మండలాలను రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. కరోనా సోకిన వ్యక్తులు ఎవరెవరు బయట తిరుగుతున్నారు? వారు ఎవరెవర్ని కలిశారు? తదితర వివరాలు సేకరిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల 20 కుటుంబాలను వైద్యపరీక్షల కోసం కాటూరి ఆస్పత్రికి తరలిస్తున్నారు.



First published: April 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading