ఏపీలో ఏకధాటిగా పెరుగుతున్న కరోనా .. 58కి చేరిన పాజిటివ్ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 21 కొత్త కేసులు నమోదు కాగా, ఈ రోజు 14 కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: April 1, 2020, 9:27 AM IST
ఏపీలో ఏకధాటిగా పెరుగుతున్న కరోనా .. 58కి చేరిన పాజిటివ్ కేసులు..
దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి సగటున 556 టెస్టులు చేస్తున్నారు.
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 21 కొత్త కేసులు నమోదు కాగా, ఈ రోజు 14 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 58కి పాజిటివ్ కేసులు చేరాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 30 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్, 10 నెగిటివ్, ఆరుగురి రిపోర్ట్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు.. ఏలూరులో 6, భీమవరంలో 2, పెనుకొండలో 2, ఉండి, గొండుగోలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు. అయితే, తాజా కేసుల సమాచారాన్ని వైద్య శాఖ ధ్రువీకరించాల్సి ఉంది. అటు.. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే ఎక్కువగా కరోనా బాధితులయ్యారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీకి 711 మంది వెళ్లొచ్చారని ఏపీ సర్కారు జాబితాను విడుదల చేసింది. విజయనగరం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం రూరల్‌లో ఒక్కరు, విశాఖపట్నం సిటీలో 41 మంది, తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో 16 మంది, రాజమండ్రిలో 21 మంది, కృష్ణా జిల్లాలో 16 మంది, విజయవాడ సిటీలో 27 మంది, గుంటూరు అర్బన్‌లో 45 మంది, గుంటూరు రూరల్‌లో 43 మంది. ప్రకాశం జిల్లాలో 67 మంది, నెల్లూరు జిల్లాలో 68 మంది, కర్నూల్ జిల్లాలో 189 మంది, కడప జిల్లాలో 59 మంది, అనంతపూర్ జిల్లాలో 73 మంది, చిత్తూరు జిల్లాలో 20 మంది, తిరుపతికి చెందిన 16 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారు.

First published: April 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading