Andhra Pradesh corona: ప్లాస్మా దానం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. తన ప్లాస్మాతో మరికొందరు రోగుల ఆరోగ్యం కాపాడవచ్చని భావిచిన ఆయన ఇవాళ ప్లాస్మాను దానం చేశారు

news18-telugu
Updated: August 5, 2020, 7:15 PM IST
Andhra Pradesh corona: ప్లాస్మా దానం చేసిన వైసీపీ ఎమ్మెల్యే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేస్తే మరికొందరు కరోనా రోగులను కాపాడవచ్చు. విషమ పరిస్థితిలో ఉన్న కరోనా రోగులకు ప్రాణం పోయవచ్చు. దీనిపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రచారం చేసినా చాలా మంది ప్లాస్మా దానానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్లాస్మాను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. గుంటూరులో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటుచేసిన ప్లాస్మా డోనార్ సెల్‌ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొట్ట మొదటగా కిలారి రోశయ్య ప్లాస్మాను దానం చేశారు.

పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. తన ప్లాస్మాతో మరికొందరు రోగుల ఆరోగ్యం కాపాడవచ్చని భావిచిన ఆయన ఇవాళ ప్లాస్మాను దానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్లాస్మాను దానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. కరోనా బాధితులు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని.. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తోందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న 18 నుంచి 50 ఏళ్ల లోపు వారు ప్లాస్మాను ఇచ్చేందుకు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

కాగా, ఏపీలో మంగళవారం రాత్రి వరకు 1,76,333 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి ఇప్పటి వరకు 95,625 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 1604 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 79,104 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 21,75,070 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
Published by: Shiva Kumar Addula
First published: August 5, 2020, 7:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading