ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులతో పాటు సినీ స్టార్లు, రాజకీయ నేతలు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కరోనా బారినపడ్డారు. విజయసాయి రెడ్డితో పాటు పాటు ఆయన పీఏ కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో ఆయన సెల్ఫ్ క్వారంటైన్లోకు వెళ్లిపోయారు. వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
In view of the Covid situation I have decided to quarantine myself for a week to ten days as a mark of abundant caution.I will not be available on telephone except for emergencies.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 21, 2020
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే హోం క్వారంటైన్లో ఉంటున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. అత్యవసరం అయితే తప్ప టెలిఫోన్లో కూడా అందుబాటులో ఉండబోనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఐతే కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.
ఇక ఏపీలో ఇప్పటి వరకు 58,668 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 25,574 మంది డిశ్చార్జి కాగా.. 758 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 32,336 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో 37,162 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 16,610 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లు ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 13,86,274 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Coronavirus, Covid-19, Vijayasai reddy, Ysrcp