ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ప్రస్తుతం రాచమల్లు శివప్రసాద్ హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే.

news18-telugu
Updated: August 15, 2020, 2:39 PM IST
ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనాబారిన పపడుతున్నారు. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం రాచమల్లు శివప్రసాద్ హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే.

రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, డిప్యూటీ అంజాద్ బాషా, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు అంబటి రాంబాబు, కరణం బలరాం, బియ్యపు మధుసుధన్ రెడ్డి, ఎన్. వెంకటయ్య గౌడ్, ముస్తఫా, అన్నాబత్తుల శివకుమార్, కిలారి రోశయ్య, హఫీజ్ ఖాన్, గంగుల బిజేంద్ర రెడ్డి, అన్నా రాంబాబు, డాక్టర్ సుధాకర్, గొల్ల బాబూరావు, కే. శ్రీనివాసరావు, విశ్వసరాయి కళావతి కరోనా బారినపడ్డారు. వీరిలో పలువురు ఇప్పటికే కోలుకున్నారు.

కాగా, ఏపాలో ఇప్పటి వరకు 2,73,085 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,70,924 కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 90,840 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 2475 మంది చనిపోయారు. ఇక రాష్ట్రంలో 27.05 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
Published by: Shiva Kumar Addula
First published: August 15, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading