ఏపీలో కరోనా వైరస్ బీభత్సం... ఆల్‌టైమ్ రికార్డు మరణాలు

గడిచిన 24 గంటల్లో 60,576 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 31,477 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 22,35,646 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

news18-telugu
Updated: August 5, 2020, 8:45 PM IST
ఏపీలో కరోనా వైరస్ బీభత్సం... ఆల్‌టైమ్ రికార్డు మరణాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 10,128 కొత్త కేసులు రావడంతో పాటు 77 మంది మరణించారు. తూర్పుగోదావరిలో 1544, కర్నూలులో 1368, అనంతపూర్‌లో 1260 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరణాలు విషయానికొస్తే.. గుంటూరులో 16, విశాఖలో 12, శ్రీకాకుళంలో 10, చిత్తూరులో 8, తూర్పుగోదావరిలో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, కర్నూలులో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, కడపలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు మరణించారు.

తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,461కి చేరింది. కరోనా మహమ్మారిని జయించి 1,04,354 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1681 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,426 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 60,576 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 31,477 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 22,35,646 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన
Published by: Shiva Kumar Addula
First published: August 5, 2020, 8:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading