Home /News /coronavirus-latest-news /

ANDHRA PRADESH COMPETING WITH OTHER COUNTRIES IN DAILY NUMBER OF CORONA VACCINATION FULL DETAILS HERE PRN

AP vs USA: అమెరికాతో ఆంధ్రా పోటీ... ఏ విషయంలోనో తెలుసా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రస్తుతం ఉన్న వ్యవస్థ తోడ్పాటుతో నెలన్నర రోజుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ (Corona Vaccine) ఇచ్చే సామర్ధ్యం ఉందని ఏపీ ప్రభుత్వం (AP Government) చెబుతోంది.

    ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు అన్ని దేశాలు తమ ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇటు భారత్ లో కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లో ప్రతి రోజూ లక్షలాది మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటివరకు కోటి మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తైంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నిమరింత ముందుకు తీసుకెళ్లేందుకు జూన్ 20న రాష్ట్ర ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. ఒక్కరోజులో 13.60 మందికి వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించింది. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ తో అగ్రరాజ్యాలతో ఆంధ్రప్రదేశ్ పోటీ పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, రష్యా, కెనడా దేశాలతో పోటీపడటంతో పాటు రోజువారీ వ్యాక్సినేషన్ లో దేశంలో బెస్ట్ స్టేట్ గా నిలిచింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 28 కోట్ల డోసులు వేయగా.. రోజుకు సగటున 15 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఏపీలో ఒక్కరోజులో 13.60 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు.

    అగ్రరాజ్యం అమెరికాలో 6 నెలల క్రితం వాక్సినేషన్ స్టార్ట్ మొదలవగా.. మొత్తం 30 కోట్ల డోస్ లు వేశారు.. సగటున రోజుకు 16 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇంగ్లాండ్ లో ఇప్పటివరకు 7.40 లక్షల డోస్ లు వేయగా.. సగటున రోజుకి 4 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. జర్మనీలో 6.57 కోట్ల వ్యాక్సిన్లు వేయగా.. రోజుకి 3.70 మందికి వ్యాక్సినేషన్ సాధ్యమైంది. జపాన్ లో 2.89 కోట్ల వ్యాక్సిన్లకు గానూ.. రోజుకు సగటున 1.60 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం సాధ్యమైంది. రష్యాలో మొత్తం 3.80 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయగా.. రోజకు 2.20 లక్షల మంది డోసులు వేశారు. కెనడాలో 3.18 కోట్ల డోసులకు గానూ రోజుకు 1.76 లక్షల మందికి వేశారు. దక్షిణ కొరియాలో 1.81 కోట్ల డోసులు పూర్తవగా.. రోజుకు లక్షమందికి వేశారు.

    ఇది చదవండి: 30 మందికి ఫస్ట్ డోస్ కొవిషీల్డ్.. సెకండ్ డోస్ కొవాగ్జిన్... వారి పరిస్థితి ఎలా ఉందంటే..!


    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యవస్థ వల్ల రోజుకు 15 లక్షల డోసులు అవలీలగా వేసే సామర్ధ్యం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.25 కోట్ల డోసులు వేయగా.. అందులో 26 లక్షల మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. 3 కోట్ల 75 లక్షల మంది ఒక్కడోస్ కూడా తీసుకోలేదు. వీరిలో 75 లక్షల మంది 18 ఏళ్ల లోపు వారుండగా.. 3 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. అనగా వీరికి 6 కోట్ల డోసులతో పాటు ఒకడోస్ తీసుకున్నవాళ్లు 72 లక్షల మంది కలిపి మొత్తం 6.72 కోట్ల డోసులు వేయాల్సి ఉంది. ప్రస్తుతమున్న సామర్ధ్యం ప్రకారం రోజుకు 15 లక్షల డోసులు వేస్తే 45 రోజుల్లో 6.72 కోట్ల డోసులు వేయగలమని ప్రభుత్వం ప్రకటించింది.

    ఇది చదవండి: వీళ్లు దండుపాళ్యం బ్యాచ్ కంటే దారుణం... మర్డర్ చేస్తే చిన్న డౌట్ కూడా రాదు..!

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Corona Vaccine

    తదుపరి వార్తలు