• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • ANDHRA PRADESH CM YS JAGANMOHAN REDDY WRITES TO PRIME MINISTER NARENDRA MODI ON CORONA VACCINE AND OXYGEN REQUIREMENTS IN THE STATE FULL DETAILS HERE PRN

Andhra Pradesh: ఆక్సిజన్ కొరత తీర్చండి... ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ..

Andhra Pradesh: ఆక్సిజన్ కొరత తీర్చండి... ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ..

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆక్సిజన్ కొరత (Oxygen Crisis), వ్యాక్సినేషన్ (Vaccination) పై సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) కి లేఖరాశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఆక్సిజన్, వ్యాక్సిన్ల అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖరాశారు. ప్రధానంగా ఏపీలో ఆక్సిజన్ కొరత తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఏపీకి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని కోరారు. అలాగే 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఇవ్వాలన్నారు. ప్రస్తుతం అందుతున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఏపీకి సరిపోవడం లేదన్న జగన్.. తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. ఈనెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యమైందని.., ఆక్సిజన్ రావడం ఆలస్యమవ్వడంతో తిరుపతిలో 11 మంది చనిపోయారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న 20 ఎంటి ఆక్సిజన్‌ను 150 మెట్రిక్ టన్నులకు.. ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 400 మెట్రిక్ టన్నులకు పెంచాలని సీఎం జగన్ కోరారు.

    వ్యాక్సిన్ విషయంలోనూ సీఎం జగన్.. ప్రధానికి పలు విజ్ఞప్తులు చేశారు. భారత్ బయోటెక్ కోవాగ్జీన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరీశీలించాలని లేఖలో పేర్కొన్నారు. పెద్దమొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థ కోవాగ్జిన్ ఒక్కటేనన్న సీఎం.. వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సహకరించాయన్నారు. ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయొచ్చని పేర్కొన్నారు.

    ఇది చదవండి: మంత్రి కొడాలి నానిపై పోలీస్ కేసు.. కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా..?


    మరోవైపు రాష్ట్రంలో కరోనా కట్టడి.. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి 2–3 కొవిడ్ ఆస్పత్రులకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ కచ్చితంగా ఉండాలని.. 648 ఆస్పతులకూ కచ్చితంగా నోడల్‌ అధికానులను నియమించాలని స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ,, ఆక్సిజన్‌ సప్లై, ఆస్పత్రుల పనితీరు, శానిటేషన్, ఫుడ్‌క్వాలిటీ దీనిమీద నోడల్‌ అధికారులు దృష్టిపెట్టాలన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జిల్లాల్లో ఆక్సిజన్‌ వార్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్.., ఎస్‌ఓఎస్‌.. ఎమర్జెన్సీ మెసేజ్‌ రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయగలిగితే... సమర్థవంతంగా ముందుకు సాగే అకాశం ఉంటుందన్నారు. ఇక కొవిడ్ ఆస్పత్రుల్లో వైద్యులను కూడా వెంటనే నియమించాలని.. ఇందుకోసం వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలను వెంటనే నిర్వహించాలని ఆదేశించారు.

    ఇది చదవండి: ఆదుకోవాల్సిన సమయంలో ఎంజాయ్ మెంట్.. వైసీపీ నేతల తీరుపై విమర్శలు

    Published by:Purna Chandra
    First published: