ANDHRA PRADESH CM YS JAGANMOHAN REDDY SETS NEW TARGET ON CORONA VACCINATION PROGRAM IN THE STATE FULL DETAILS HERE PRN
Andhra Pradesh: రోజుకు 25 లక్షల మందికి వ్యాక్సిన్.. సీఎం జగన్ నయా టార్గెట్..
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)
ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) కార్యక్రమంలో రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. (Andhra Pradesh Government) ఈ రికార్డును బద్దలు కొట్టేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రోజుకు 25 లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్ధ్యం మనకుందని ఆయన అన్నారు. సోమవారం కరోనా నివారణపై సమీక్ష నిర్వహించిన జగన్.., రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేసిన సిబ్బందిని సీఎం అభినందించారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఇచ్చే సమర్థత ఉందని నిరూపించారని ఆయన అన్నారు. ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయాల్లో సిబ్బంది.., అలాగే మండలానికి రెండు పీహెచ్‌సీలు, అందులోని డాక్టర్లు చక్కగా పనిచేశారని జగన్ అన్నారు. అధిక సంఖ్యలో వ్యాక్సిన్లు మనకు అందుబాటులో ఉంటే.. అంతేస్థాయిలో వ్యాక్సిన్లు ఇవ్వగలిగే సామర్థ్యం మనకు ఉన్నాయని.. ఇంత కంటే మెరుగ్గా చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే మరో మెగా డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఒక్క రోజులో 20 నుంచి 25 లక్షల మందికి వాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలతో పాటు వాక్సినేషన్‌పై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,068క తగ్గిందని.. పాజివిటీ రేటు కూడా 5.65 శాతానికి పడిపోయిందన్నారు. అలాగే రికవరీ రేటు 95.93శాతానికి చేరినట్లు వివరించారు. పొరుగురాష్ట్రాల్లో కోవిడ్ నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను సడలిస్తున్నందువల్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 2,655 ఐసియూ బెడ్లు, 13,824 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక రాష్ట్రంలో 2,772 యాక్టివ్ బ్లాక్ ఫంగస్ కేసులుండగా వీరిలో 922 మందికి సర్జరీలు జరిగాయని.. 1,232 మంది డిశ్చార్జి అవగా.. 212 మంది మృతి చెందినట్లు వివరించారు.
ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 1,37,42,417 డోసుల వ్యాక్సినేషన్ పూర్తవగా.. 82,77,225 మందికి మొదటి డోసు, 27,32,596 మందికి రెండు డోసుల వాక్సిన్ పూర్తైనట్లు వివరించారు. మొత్తంగా 1,10,09,821 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. ఐదేళ్లలోపు వయస్సున్న పిల్లల తల్లుల్లో 10,29,266 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. జూన్ 20న నిర్వహించిన మెగా డ్రైవ్‌లో 13,72,481 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు అధికారులు తెలిపారు.
ఇక రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పనుల జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై సీఎం ఆదేశాలమేరకు అధ్యయనం చేసినట్లు అధికారులు తెలిపారు. బిల్డింగ్, సర్వీసులు, నాన్ బిల్డింగ్ సర్వీసులపై అధ్యయన వివరాలను తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.