హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Andhra Pradesh: కరోనా బాధితులకు ఊరట.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh: కరోనా బాధితులకు ఊరట.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh: కోవిడ్‌ చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలని, ఇందులో ఎక్కడా తేడా రాకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు.

    ఏపీలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో కరోనా నియంత్రణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న జగన్ సర్కార్.. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడంపై కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు 50 శాతం బెడ్లు కేటాయించాలన్నారు. అంతకంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. కొవిడ్‌ ఆస్పత్రుల వద్దనే కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వైద్యులు, మంచి భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

    కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కోవిడ్‌ చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలని, ఇందులో ఎక్కడా తేడా రాకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌లో ఉన్న వాటితో సహా, అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స ఒకేలా ఉండాలన్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో ఉన్న బెడ్లు ఎన్ని? వాటిలో ఎన్ని కోవిడ్‌ రోగులకు ఇస్తున్నారు? అన్నది పూర్తి క్లారిటీ ఉండాలని సీఎం ఆదేశించారు. ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలని, కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు.

    First published:

    Tags: Aarogyasri, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

    ఉత్తమ కథలు