AP CM Jagan: సోమవారం ఢిల్లీకి జగన్... అమిత్ షాతో భేటీ.. అందుకే అంటూ జోరుగా ప్రచారం

ఢిల్లీకి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఢిల్లీ పర్యటనపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.. ఇంతకీ జగన్ ఢిల్లీ పర్యటనకు కారణమేంటి..?

 • Share this:
  ఏపీ సీఎం జగన్ మరోసారి హస్తిన బాట పట్టారు. కరోనా విస్తరిస్తున్న వేళ.. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ.. ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడం సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. ముఖ్యంగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారని తెలుస్తోంది. వ్యాక్సినేషన్ విషయంలో అంతా ఒక మాటపై ఉండాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు ఇటీవల జగన్ లేఖలు రాశారు. ప్రస్తుతం ఈ విషయంపై తీవ్రంగా చర్చ జరగుతోంది. మరోవైపు ఎంపీ రఘురామ రాజు ఢిల్లీలోనే ఉంటూ.. తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ చేశారంటూ కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు.  అలాగే ఎన్ హెచ్ ఆర్ సీ సైతం ఏపీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది.  ఇలాంటి సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు వినిస్తున్నాయి. అందులోనే నేరుగా అమిత్ షాను కలుస్తుండడంతో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత చేకూరింది.

  పోలవరం ప్రాజెక్టు రావాల్సిన నిధులు.. దానికి తోడు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తారని వైసీపీ వర్గీయులు చెబుతున్నారు. విభజన హామీలు, వ్యాక్సినేషన్‌పై కూడా సీఎం జగన్ సంబంధిత శాఖల మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ఆయన వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలుగా మనం ఏమీచేయలేం. చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రానికి వదిలేద్దాం అని లేఖలో పేర్కోన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల సీఎం లకు ఆయన లేఖలు రాసినప్పటికీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రాసిన లేఖ బహిర్గతమయ్యింది. సీఎం జగన్ లేఖలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏపీలో విపక్షాలు మాత్రం సీఎం జగన్ లేఖలను తీవ్రంగా తప్పు పడుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని జాతీయ మీడియా చెబుతోంది.

  వైసీపీ వర్గాల్లో మరో ప్రచారం జరుగుతోంది. కేంద్ర పెద్దలతో మంతనాల కోసమే అధినేత జగన్ ఢిల్లీ వెళ్తున్నారనే చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ రద్దుపై కోర్టు విచారణ నేపథ్యంలో ఢిల్లీ టూర్‌కి ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీ సర్కార్‌ రాజద్రోహం కేసు, థర్డ్‌ డిగ్రీ ప్రయోగంపై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఎంపీ రఘురామరాజు ఫిర్యాదులు చేశారు. దీంతో సీబీఐ, ఈడీ కేసులు, బెయిల్ రద్దుపై విచారణ నేపథ్యంలో వ్యాక్సిన్ల అంశంపై కేంద్రంతో జగన్ ఎలా వ్యవహరించబోతున్నారనే అంశంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరో సోమవారం పర్యటన తరువాత అన్ని అనుమానాలకు సమాధానం దొరికే అవకాశం ఉంది.
  Published by:Nagesh Paina
  First published: