• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY FOUCUSED ON OXYGEN CYLINDERS SUPPLY IN ANDHRA PRADESH KEY SUGGESTIONS TO OFFICIALS NGS

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం. విదేశాల నుంచి ఆక్సిజన్ దిగుమతిపై ఫోకస్

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం. విదేశాల నుంచి ఆక్సిజన్ దిగుమతిపై ఫోకస్

ఏపీ వ్యాప్తంగా ఆక్సిజన్ నిల్వలపై సీఎం జగన్ ఫోకస్

ఏపీలో ఆక్సిజన్ లేని కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆక్సిజన్ కొరత లేకుండా చేయడంపై ఏపీ సర్కార్ ఫోకస్ చేసింది. అవసరమైతే ఇతర దేశాల నుంచి తెప్పించడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

  • Share this:
    ఏపీపై కరోనా వైరస్ పగ బట్టినట్టు ఉంది. అందుకే వైరస్ నిర్ధారణ అయిన వారి సంఖ్యతో పాటు.. కరోనా బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. అయితే ఈ సారి మరణాలు ఎక్కువగా నమోదవ్వడానికి ప్రధాన కరాణం అందరికీ సరిపడ ఆక్సిజన్ సప్లై లేదనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేదనే సమాధానం వినిపిస్తోంది. ఇటు కరోనా బాధితులు, అటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలన్నీప్రభుత్వం తీరును తప్పు పడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆక్సిజన్ అందుబాటులో లేదని.. కేవలం ఆక్సిజన్ లేని కారణంగా ఇంతమంది చనిపోవడం దారుణమని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సరిపడ ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని వాధిస్తూ వస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.

    దీంతో కోవిడ్ నియంత్రణ పై సమీక్షలో ఆక్సీజన్‌ సరఫరా పై సీఎం వైఎస్ జగన్‌ కీలక అదహేశాలు జారీ చేసారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రులలో రోగులకు సరిపడా ఆక్సీజన్‌ను అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. దీని కోసం తగిన విధంగా ఆక్సీజన్‌ దిగుమతి చేసుకోవాలని సూచించారు. ఆ దిగుమతి చేసుకున్న ఆక్సీజన్‌ను నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయండి అని అధికారులకు సలహా ఇచ్చారు. ఆ మేరకు ట్యాంకర్లను సేకరించండి అని చెప్పిన జగన్ ఏ ఆస్పత్రిలో కూడా ఆక్సీజన్‌ కొరత లేకుండా చూడండి అని అధికారులకు పదే పదే స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు.

    ఏపీ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరతపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరతపై దృష్టి సారించారు సీఎం జగన్. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో సరిపడ ట్యాంకర్లు లేవని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కంటైనర్ ట్యాంకర్ల కొనుగోలుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారు. అంతేకాదు అవసరమైతే విదేశాల నుంచి ఆక్సిజన్ కూడా కొనుగోలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. విదేశాల్లో ఆక్సిజన్ సరఫరా చేసే వారి వివరాలు సేకరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

    మరోవైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటిక నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం ఇప్పుడు డే కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మే 5వ తేదీ నుంచి పగటి పూట కర్ఫ్యూ అమలు చేసే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.  రాష్ట్రంలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు యధావిధిగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని… మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని చెప్పారు
    Published by:Nagesh Paina
    First published: