• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • ANDHRA PRADESH CHIEF MINISTER YS JAGANMOHAN REDDY CONDUCTED REVIEW ON COVID 19 VACCINATION AND TREATMENT IN STATE HERE ARE THE DETAILS PRN

AP CM YS Jagan: ఏపీలో లాక్ డౌన్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

AP CM YS Jagan: ఏపీలో లాక్ డౌన్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

ఏపీ సీఎం జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొవిడ్ వ్యాక్సినేషన్ (Corona Vaccination), నివారణపై సీఎం జగన్ (AP CM Jagan) దృష్టి పెట్టారు. వ్యాక్సిన్ డోసులు తక్కువగా ఉండటంతో కేంద్రం నుంచి రప్పించాలని అధికారులను ఆదేశించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ పట్ల పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం జగన్ ఆదేశించారు. మళ్ళీ లాక్‌డౌన్ పరిస్థితులు వస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని.. గత ఏడాది కొవిడ్ వల్ల రాష్ట్రానికిరూ.21 వేల కోట్లు ఆర్థికంగా నష్టం వచ్చిందని తెలిపారు. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రెమిడెసివీర్ కొరత రాకుండా అవసరమైన డోసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. హోం ఐసోలేషన్ ఉన్నవారి కోసం 4 లక్షల కొవిడ్ మెడిసన్ కిట్లు అందుబాటులో వున్నాయన్న అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 1.4 లక్షల మందికి కరోనా వాక్సినేషన్ వేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వాక్సినేషన్‌కు మన యంత్రాంగం సర్వం సమాయాత్తమై ఉందని, అయినా తగినన్ని డోసుల వాక్సిన్ అందుబాటులో లేదని సీఎంకు వివరించారు.

    ప్రస్తుతానికి 3 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఇవి రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని సీఎంకు తెలిపారు. మన అవసరాలకు తగినన్ని డోసుల వాక్సిన్ సరఫరా కావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నివారణకు వాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని.. దీనిపై అధికారులు మరింత చురుగ్గా దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం అర్బన్ వార్డు సచివాలయాల్లో జరుగుతున్న వాక్సినేషన్‌ను రూరల్ లో కూడా జరిగేలా చూడాలన్నారు సీఎం జగన్.

    ఇది చదవండి: జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్.. అడ్డంగా బుక్కైన వైసీపీ..?


    రాష్ట్రంలో 45 ఏళ్ళకు పైబడి ఇంకా వాక్సినేషన్ చేయించుకోవాల్సిన వారు సుమారు కోటి మంది వరకు వుంటారని అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి వాక్సినేషన్ అందించాలన్న లక్ష్యంతో పనిచేయాలని సీఎం అదేశించారు. పిహెచ్‌సిల్లో ఇద్దరు, 104లో ఒక వైద్యుడు అందుబాటులో వున్న నేపథ్యంలో ప్రతి వైద్యుడు తన పిహెచ్‌సి పరిధిలో నిర్ధేశిత గ్రామాల్లో పర్యటించి వైద్యసేవలు అందించాలన్న సీఎం.. దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని సూచించారు.

     ఇది చదవండి: మగాడికి వితంతు పెన్షన్... ఇదెక్కడి విడ్డూరం... అవాక్కైన అధికారులు


    వాక్సినేషన్‌ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వలంటీర్లు, ఆశావర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సీఎం జగన్ చెప్పారు. అప్పుడే అనుకున్న విధంగా వాక్సినేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తవుతుందన్న అభిప్రాయపడ్డారు. వాక్సినేషన్ కోసం అవసరమైన డోస్‌లను సిద్దం చేసుకోవడం ద్వారా వాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలన్నారు.

    కొవిడ్ చికిత్సపై సమీక్ష
    కోవిడ్ చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ జరగడానికి వీల్లేదని.., ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే చికిత్స జరగాలని జగన్ స్పష్టం చేశారు. అలా కాకుండా అధిక ధరలపై ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆసుపత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని చెప్పారు. మాస్క్‌ పెట్టుకోని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి సూచించారు.

    రాష్ట్ర వ్యాప్తంగా 66 కోవిడ్ ఆసుపత్రులు వున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. కోవిడ్ వచ్చిన వారు ఆసుపత్రుల్లో బెడ్ కోసం 104 కి ఫోన్ చేసి అడిగితే గతంలో ఎలా సమకూర్చామో, ఇప్పుడు కూడా అలాగే చేయాలని జగన్ ఆదేశించారు. కోవిడ్ పేషంట్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగా చికిత్స అందించాలన్నారు. ఆసుపత్రుల్లో స్టార్‌ రేటింగ్ ఇచ్చి మానిటరింగ్ చేయాలని.. ఆసుపత్రుల్లో ఫుడ్, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
    Published by:Purna Chandra
    First published: