• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • ANDHRA PRADESH CHIEF MINISTER YS JAGANMOHAN REDDY CONDUCTED HIGH LEVEL REVIEW MEETING ON CORONA AND VACCINATION PROGRAM IN THE STATE FULL DETAILS HERE PRN

AP CM YS Jagan: కరోనా కట్టడికి సీఎం జగన్ యాక్షన్ ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు

AP CM YS Jagan: కరోనా కట్టడికి సీఎం జగన్ యాక్షన్ ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan/File photo)

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) సమీక్ష నిర్వహించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్ సమావేశం జరిగింది. కరోనాపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలోనే ప్రధమ స్థానం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం మాట్లాడుతూ..“నిన్న అత్యధికంగా 6.21 లక్షల వాక్సిన్లు ఇచ్చాం. ఇది ఒక రికార్డు. ఇందుకు ప్రతి ఒక్కరికి అభినందిస్తున్నాను. మీరంతా ఎంతో చొరవ చూపి పని చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, పీహెచ్‌సీల సిబ్బంది కూడా అందరూ సమష్టిగా పని చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. రికార్డు స్థాయిలో వాక్సిన్‌ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం అనుకున్న లక్ష్యం సాధించాము. రోజుకు 6 లక్షల వాక్సిన్లు ఇవ్వాలన్నది మన లక్ష్యం. దాన్ని సాధించాము. ఇక ముందు కూడా అలాగే చేయాలి. ప్రస్తుతం వాక్సిన్లు లేవు, కాబట్టి వాటి కోసం లేఖ రాయండి. అవసరం అనుకుంటే నేను కూడా లేఖ రాస్తాను” అని అన్నారు.

    ఇక ఇవాళ్టి నుంచి 104 కాల్‌ సెంటర్‌పై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎవరికైనా చికిత్స, బెడ్‌ కావాలంటే ఆ కాల్‌ సెంటర్‌ ద్వారా సేవలందించాలని.., హోం ఐసొలేషన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా ఆస్పత్రిలో చేర్చడానికి వైద్యుల సూచనల మేరకు సేవలందించాలని సూచించారు. అంబులెన్సు సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహాయంతో రోగికి వేగంగా వైద్య సేవలందించాలని చెప్పారు. రోగి ఫోన్‌ చేసిన 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్‌ సమకూర్చాలన్నారు. గ్రీవెన్సుల కోసం 1902, కోవిడ్‌ సేవల కోసం 104 వినియోగించాలని.. ఈ రెండింటినీ విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను బస్టాండ్‌ వంటి పబ్లిక్‌ ప్లేసెస్‌లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నారు.

    ప్రైవేట్ ఆస్పత్రులపై దృష్టి..
    కరోనా సోకిన వారు ప్రైవేటు ఆస్పత్రిలో చేరాలనుకుంటే, ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా, వాటిని కూడా స్పష్టంగా నిర్దేశించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆస్పత్రి చికిత్స, శానిటేషన్, నాణ్యమైన ఆహారం.. ఈ మూడు ప్రమాణాలు కోవిడ్‌ ఆస్పత్రులతో సహా, అన్ని ఆస్పత్రులలో ఉండేలా చూడాలని.. క్వాలిటీ ఆఫ్‌ మెడికేషన్‌తో పాటు, సమయానికి మందులు అందించడం అన్నది కూడా చాలా ముఖ్యమన్నారు.

    వీలైనంత త్వరగా వాక్సినేషన్‌
    రాష్ట్రంలో వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ వేయాలన్న సీఎం.. హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లందరికీ తప్పనిసరిగా వాక్సిన్‌ వేయాల్సిందేనని స్పష్టం చేశారు.

    ఇది చదవండి: సమ్మర్ లో అదిరిపోయే టూర్.. పాపికొండలు టూర్ ఇలా ప్లాన్ చేయండి..


    కాగా, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఇప్పుడు 6.03 శాతం ఉందని సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కోవిడ్‌ చికిత్స కోసం రాష్ట్రంలో 108 ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉండగా వాటిలో 15,669 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, వాటిలో ఇప్పుడు 4,889 బెడ్లు ఆక్యుపైడ్‌ కాగా, 1,987 వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని, నిన్నటి (బుధవారం) వరకు మొత్తం 22,637 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు