YS Jagan: వ్యాక్సిన్ విషయంలో ప్రధానితో జగన్ కీలక వ్యాఖ్యలు... ఏమన్నారంటే...!

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy)... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (Prime Minister Narendra Modi) కోరారు.

  • Share this:
    కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ పాల్గొన్నారు. కోవిడ్‌ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నామని సీఎం.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో లేవని.. అయినా సరే కొవిడ్ ను ఎదుర్కొవడంలో చెప్పకోదగ్గ పనితీరు కనబరిచామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయన్నారు. ఇప్పటివరకూ 12 సార్లు ఇంటింటికీ ఫీవర్‌ సర్వే చేశామని.. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ఫోకస్‌గా టెస్టులు చేయడం వల్ల కోవిడ్‌ విస్తరణను అడ్డుకోగలిగామని జగన్ అన్నారు.

    అలాగే కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి సంబంధించి కొన్ని సూచనలు చేయదలుచుకున్నామని జన్ అన్నారు. ఇప్పటివరకు 1,68,46,210 వ్యాక్సిన్‌ డోసులు రాష్ట్రానికి వచ్చాయని..., వీటితో 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇచ్చామన్నారు. వ్యాక్సినేషన్‌లో మంచి విధానాల వల్ల ఇచ్చినదానికన్నా ఎక్కువ మందికి వేయగలిగినట్లు సీఎం జగన్.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. జులై నెలలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారని.. అదే ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించాన్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారన్నారు.

    ఇది చదవండి: ఏపీలో థర్డ్ వేవ్ టెన్షన్...? పిల్లలకు కరోనా పాజిటివ్.. ఎక్కడంటే..!


    జూన్‌ నెలలో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని సీఎం జగన్.. ప్రధానిని కోరారు. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే అంశాన్ని సీఎం జగన్.. లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ లో ఏపీ ముందుందని.. పాజిటివిటీ రేటు కూడా నియంత్రణలోకి వచ్చిందని జగన్ వివరించారు.

    ఇది చదవండి: ఏపీ మహిళలు దేశంలోనే నెంబర్ వన్… ఏ విషయంలో అంటే...!



    ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published: