Home /News /coronavirus-latest-news /

ANDHRA PRADESH CHIEF MINISTER CONDUCTED REVIEW MEETING ON CORONA PREVENTION IN THE STATE FULL DETAILS HERE PRN

Andhra Pradesh: థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ ఇదే.. అధికారులతో ఏమన్నారంటే..!

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొవిడ్ థర్డ్ వేవ్ (Corona Third Wave) వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan mohan reddy) అధికారులను ఆదేశించారు.

    ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీలో కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూని జిల్లాల వారీగా సడలిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో సడలింపులిస్తున్నట్లు తెలిపారు. 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకూ కర్ఫ్యూ సడలిస్తునామని.. రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేయాలని తెలిపారు. ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపులు పరిమితమవుతాయన్నారు. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తిస్తాయన్నారు. కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ సమాచార నేపథ్యంలో 104 ద్వారా పిల్లలకు చికిత్స అందించేలా 24 గంటలూ పీడియాట్రిక్‌ టెలీ సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. ఇందుకోసం 150 మంది పీడియాట్రిషియన్ల్ల టెలీ సేవలు వినియోగించుకోవాలని.. వారికి వీరికి ఎయిమ్స్‌ లాంటి సంస్ధలకు చెందిన నిపుణలతో శిక్షణ ఇవ్వాలన్నారు.

    ఏపీలో ప్రస్తుతం 44,773 యాక్టివ్ కేసులున్నాయని.. వీరిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 7,998 మంది ఉండగా.. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 5,655 మంది ఉన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.95 శాతం, పాజిటివిటీ రేటు 4.46 శాతం ఉందని అధికారులు వివరించారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులలో 93.62 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స అందిస్తున్నట్లు సీఎంకు వివరించారు. ఇక రాష్ట్రంలో 3,329 బ్లాక్ ఫంగస్ కేసులుండగా.. వీరిలో 1,441చికిత్స పొందుతున్నారు. 253 మంది మృతి చెందగా.. 1,635 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు.

    థర్డ్‌వేవ్‌ వస్తుందన్న సమచారంతో ఇప్పటికే మూడు దఫాలుగా నిపుణులతో వెబినార్‌ నిర్వహించామని అధికారులు సీఎంకు తెలుపగా.. కొత్త వైద్యులకు కూడా ఈ వెబినార్‌లో చర్చించిన అంశాలతో అవగాహన కలిగించాలని ఆయన అన్నారు. ఇక కోవిడ్‌ బాధితులకు 190 మంది సైకియాట్రిస్టులు, 16 మంది క్లినికల్‌ సైకాలజిస్టులుతో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నట్లు అధికారులు సీంకు వివరించారు. అవసరమైన వారికి మందులు కూడా అందిస్తున్నామని వెల్లడించగా.. దీన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించిన సీఎం ఆదేశించారు. థర్డ్ వేవ్ సందర్భంగా అడ్మిషన్లు అవసరమైతే తక్షణమే స్పందించి వారికి బెడ్లు ఇప్పించాలని.., దీనికి అనుగుణమైన వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. కోవిడ్‌ యేతర కేసులకూ 104 ద్వారా ఈ పద్ధతుల్లో సేవలు అందాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలతోపాటు 104 కూడా ఆరోగ్యశ్రీకి రిఫరెల్‌ పాయింట్‌గా వ్యవహరించాలని ఆదేశించారు.

    ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Corona virus

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు