AP Corona: ఏపీలో కరోనా నివారణపై ప్రభుత్వం కీలక ప్రకటన.., ఇకపై అలా జరగదన్న మంత్రి

ఆళ్ల నాని (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజూ వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మహమ్మారిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీంతో గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యారలయంలో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ కొవిడ్ నివారణ, ఆస్పత్రుల్లో చికిత్స, ఆక్సిజన్ నిల్వలు తదిరత అంశాలపై చర్చించింది. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలో పరిస్థితిని సీఎం జగన్ నిరంతరం సమీక్షిస్తున్నారని ఆళ్లనాని తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు, ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంపు, కోవిడ్ కేర్ కేంద్రాలను పెంచటం, రెమెడిసివిర్ ఇంజెక్షన్ లభ్యత, ఆక్సిజన్ కొరత లాంటి అన్ని అంశాలు చర్చించినట్లు సమావేశంలో ఆళ్లనాని తెలిపారు.

  కోవిడ్ నియంత్రణ కోసం, ప్రజలకు సందేహాలు నివృత్తి, ఫిర్యాదుల స్వీకరణ కోసం 104 కాల్ సెంటర్ ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే దేశంలో కరోనా నియంత్రణ మందులు, ఆక్సిజన్ కొరత ఉందని.. ఏపీలోను ఇబ్బందులు ఉన్నపటికీ దాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

  ఇది చదవండి: ఏపీలో కొవిడ్ వ్యాప్తిది ఇదే ప్రధాన కారణమా..? తప్పు ఎక్కడ జరుగుతోంది..?


  సీఎం దగ్గర జరిగే సమీక్ష లో ఈ అంశాలను ప్రస్తావించి మెరుగైన చర్యలు చేపడతామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి, అలా కాకపోతే కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడబోమన్నారు. ప్రజలు మాస్కు లు, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేయాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా పూర్తి చేసే దుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోందని.., ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఆక్సిజన్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్రం సహకారం అందిస్తామని తెలిపిందన్నారు.

  ఇది చదవండి: ఏపీలోని మరో నగరంలో నైట్ కర్ఫ్యూ.. రాత్రి 7 గంటలకే అన్నీ బంద్...


  ఇక ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోందని.. ఇప్పటికే 49 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు తెలిపారు. కేంద్రం సరఫరా చేసినంత మేర వ్యాక్సినేషన్ వేయగలుగుతున్నామన్నారు. 18 ఏళ్ల పైబడిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ వేసే విషయంలో ఇంకా స్పష్టత లేదని.., సీఎం దగ్గర చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆళ్ల నాని తెలిపారు. అలాగే కోరోనా టెస్టుల సామర్ధ్యాన్ని పెంచుతామన్న ఆయన.. ఫలితాలు ఆలస్యం కాకుండా తగిన చర్యలు చేపడాతమని స్పష్టం చేశారు.
  Published by:Purna Chandra
  First published: