ANDHRA PRADEHS CM YS JAGAN SAYS YSR BHIMA SCHEME SET NEW GUIDLINES FROME JULY 1ST NGS
Andhra Pradesh: సీఎం జగన్ కీలక నిర్ణయం.. సహజమరణం చెందిన వ్యక్తి కుటుంబానికి బీమా.. షరతులు ఇవే..
వైఎస్ఆర్ బీమా పథకంలోకీలక మార్పులు
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సాఆర్ బీమా పథకంలో కొన్ని మార్పులు చేశారు. జులై 1లోగా క్లెయిమ్లన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
YSR Bhima Scheme: ఏపీ సీఎం జగన్ సంక్షేమంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. కరోనా కష్ట కాలంలోనూ వరుస సంక్షేమ పథకాలను పెంచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా వైఎస్సార్ బీమాపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు ఉండి.. సహజంగా మరణిస్తే లక్ష రూపాయల సాయం అందించాలని.. ఒకవేళ సంపాదించే వ్యక్తి 18 నుంచి 75 ఏళ్లు దాటినవారై ఉండి.. ప్రమాదవశాత్తు మరణిస్తే.. 5 లక్షల రూపాయల సాయం అందచేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. మార్పులు చేసిన వైఎస్సార్ బీమా జులై 01 వ తేదీ నుంచి అమలు కానుంది. జులై 01వ తేదీ లోగా క్లెయిమ్ లను అన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో బీమా పరిహారం చెల్లించాలని సీఎం జనగ్ సూచించారు. బీమా పరిహారంపై ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.
తాడేపల్లిలో వైఎస్సార్ బీమా పథకంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. లేదంటే బీమా వర్తించడం కష్టమే. నిరుపేద కుటుంబాలకు జీవన భద్రత కల్పిస్తూ కష్టకాలంలో ఆదుకునేలా వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. బియ్యం కార్డులున్న కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకోనుంది. 2020, అక్టోబర్ 21వ తేదీన సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. బియ్యం కార్డులు కలిగిన వారు మాత్రమే ఈ బీమాకు అర్హులని చెప్పారు. అయితే 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి కుటుంబాన్ని పోషించే వారికి మాత్రమే పథకం వర్తిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం వర్తించేలా చేయడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా పథకాలు అమలు చేసింది. ఇంకా కొత్త పథకాలను ప్రవేశ పెడుతూనే ఉంది. ఇందుకోసం అప్పు చేసి మరీ పథకాలకు డబ్బు కేటాయిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాలతోపాటూ.. మరిన్ని అదనపు స్కీములను కూడా అమలు చేసింది ప్రబుత్వం. ముఖ్యంగా పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, గర్భిణులు, విద్యార్థులు, ముసలి వారు ఇలా... అన్ని వయసుల వారికీ వర్తించేలా ప్రభుత్వ పథకాలున్నాయి. కరోనా కష్ట కాలంలోనూ ఈ పథకాలను సీఎం జగన్ కొనసాగిస్తూనే ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.