కరోనా పై యాంకర్ సుమ సూచనలు.. సపోర్ట్‌గా నిలిచిన అనసూయ, రష్మీ..

తెలుగు యాంకర్స్ (Telugu anchors)

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ఇపుడు దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ బెంబేలెత్తిస్తోంది. తాజాగా కరోనా వైరస్ పై సుమ అమూల్యమైన సూచనలు చేసింది. దీనిపై నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

  • Share this:
    ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ఇపుడు దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ బెంబేలెత్తిస్తోంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యక్తిగత శుభ్రత పాటించాలంటూ సూచనలు చేస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా వైరస్‌పై తమదైన శైలిలో సూచనలు  సలహాలు ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ యాకంర్ సుమ కూడా కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పలు సూచనలు చేసింది. తాజాగా సుమ.. మరో తన సోషల్ మీడియా అకౌంట్‌లో మరో పోస్ట్ చేసింది. నేనైతే ప్రతి రోజు శానిటైజర్ వాడుతున్నాను. లేకపోతే చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నాని తెలిపింది. కరోనా పై భయపడాల్సిన పనిలేదు. బాధ్యతగా వ్యవహరిస్తే సరిపోతుంది. చేతులతో ముఖాన్ని టచ్ చేయెద్దని సూచించింది. ఒకవేళ దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలి. ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే వారికి దూరంగా ఉండాలన్నారు. అంతేకాదు ఎవరికైనా తేడా అనిపిస్తే.. వైద్య పరీక్షలు చేయించుకోమని సలహాలు ఇవ్వాలన్నారు.


    ఎవరైనా ఆత్మీయులు, స్నేహితులు కలిసినపుడు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. హగ్గులు, పెగ్,షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదన్నారు. మీరు ఈ వీడియోలో ఒకటి గమనించారా ? నేను మాట్లాడుతుంటే నా చేయి ఆటోమేటిక్‌గా ముఖం పైకి వెళ్లిపోయింది చూశారా ? అలా చేతుల్లోంచి వైరస్ మనలోకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: