ఏపీలో మాస్క్‌లేని వారికి క్వారంటైన్... వైన్ షాపుల వద్ద పరుగో పరుగు..

ప్రతీకాత్మక చిత్రం

అనంతపురం పట్టణంలో మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారిని కరోనా వైరస్ క్వారంటైన్ కేంద్రాలకు బలవంతంగా తీసుకెళ్లారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా అనంతపురం పట్టణంలో మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారిని కరోనా వైరస్ క్వారంటైన్ కేంద్రాలకు బలవంతంగా తీసుకెళ్లారు. అనంతపురంలోని టూటౌన్ పోలీసులు నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎవరైతే మాస్క్‌లు పెట్టుకోకుండా రోడ్ల మీద నిర్లక్ష్యంగా తిరుగుతున్నారో వారిని పట్టుకున్నారు. అలా పట్టణంలోని వైన్ షాపు వద్ద, రోడ్ల మీద ఉన్న కొందరిని గుర్తించారు. వెంటనే పోలీసులు జీపుల్లో నుంచి దిగి వారిని పట్టుకున్నారు. మాస్క్‌లు లేని వారిని పట్టుకుంటున్నట్టు అక్కడున్న మరికొందరికి వెంటనే బల్బు ఎలిగింది. అంతే వెంటనే పరుగులు పెట్టారు. కొందరు బాబోయ్.. మమ్మల్ని తీసుకెళ్లొద్దు బాబోయ్ అంటూ గావు కేకలు పెడుతూ పోలీసులు చేతి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ‘సార్. సార్. ప్లీజ్ సార్. తీసుకెళ్లొద్దు సార్.’ అంటూ అరుపులు, కేకలతో వారు పోలీసులను వేడుకున్నారు. అయితే, ఆరుగురిని పోలీసులు ఆంబులెన్స్‌లో క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: