
ప్రతీకాత్మక చిత్రం
కరోనా వైరస్ ఒడిశా అసెంబ్లీ ఉద్యోగికి వచ్చింది. దీంతో అసెంబ్లీలోని ఉద్యోగులు, అధికారులందరినీ క్వారంటైన్‌కు పంపారు. ఈనెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
అసెంబ్లీ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఒడిశా అసెంబ్లీలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులందరికీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. కరోనా వైరస్ సోకిన సదరు ఉద్యోగిని ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లారు. ముందస్తు జాగ్రత్తగా అసెంబ్లీలో పనిచేస్తోన్న ఉద్యోగులు, అధికారులను క్వారంటైన్ చేశారు. దీంతో పాటుగా మార్చి 30వ తేదీ నుంచి ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఉద్యోగి అసెంబ్లీ భవనం మొత్తం తిరిగడంతో సమావేశాలను వేరే భవనంలో నిర్వహించాలని నిర్ణయించారు. 30వ తేదీ నుంచి జరిగే సమావేశాలను లోకసేవా భవన్లో నిర్వహించనున్నట్టు ఒడిశా అసెంబ్లీ స్పీకర్ ఎస్ఎన్ పాత్ర తెలిపారు. శాసనసభ్యులందరూ ఈ సమావేశాలకు హాజరుకావాలని స్పీకర్ కోరారు.
Published by:Narsimha Badhini
First published:March 28, 2020, 14:39 IST