కరోనా వైరస్‌ను దేశం నుంచి తరిమికొట్టడానికి తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వారికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబాబ్ బచ్చన్ కుటుంబం సంఘీభావం తెలిపింది. జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్న అమితాబ్ కుటుంబం సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చి గంట కొడుతూ, చప్పట్లు కొడుతూ కరోనా వైరస్ మీద పోరాడుతున్న వారికి మద్దతు తెలిపింది. ముంబైలోని తమ నివాసం నుంచి బయటకు వచ్చిన అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె శ్వేత, మనవరాలు ఆరాధ్య బచ్చన్‌తో కలసి సంఘీభావం ప్రకటించారు. ఐశ్వర్యరాయ్, ఆరాధ్య బచ్చన్, శ్వేత గంట కొడుతుంటే, అమితాబ్ బచ్చన్ మాత్రం చప్పట్లు కొడుతూ తమ మద్దతు తెలిపారు.
T 3478 - Historic .. we are ONE .. and we have WON !
“शंख बजे औ ताल बजे , औ बजी है गणपत आरती,
अद्भुत दृश्य सुना विश्व नें
हम उत्तम उज्ज्वल भारती“ ~ AB
At 5pm March 22nd the entire nation came out & applauded
NEVER SEEN ANYTHING LIKE THIS ! PROUD TO BE AN INDIAN - JAI HIND pic.twitter.com/Kb07wsVxew
— Amitabh Bachchan (@SrBachchan) March 22, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aishwarya Rai, Amitabh bachchan, Coronavirus