అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌కి కరోనా పాజిటివ్.... కోలుకోవాలని బాలీవుడ్ ప్రార్థనలు

అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌కి కరోనా పాజిటివ్.... కోలుకోవాలని బాలీవుడ్ ప్రార్థనలు

అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌కి కరోనా పాజిటివ్ (File)

ముంబైలో తీవ్రస్థాయిలో ఉన్న కరోనా వైరస్... బాలీవుడ్ ప్రముఖులను కూడా వదలట్లేదు. బిగ్ బీ ఫ్యామిలీలో ఇద్దరికి కరోనా సోకడం తీవ్ర కలకలం రేపింది.

 • Share this:
  బాలీవుడ్‌ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. ఇద్దరికీ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఐతే... అమితాబ్ భార్య జయా బచ్చన్, అభిషేక్ భార్య ఐశ్వర్యరాయ్‌కి రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చిందని తెలిసింది. పది రోజులుగా అనారోగ్యంతో ఉన్న అమితాబ్... ఎందుకైనా మంచిదని... జులై 11న ఆస్పత్రిలో చేరి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. తనకు కరోనా సోకిందని బిగ్ బీ చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా... పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్‌ ద్వారా శనివారం రాత్రి తెలిపాడు.


  "ఇవాళ నాకు, నా తండ్రికి కొవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. ఇద్దరికీ స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఇద్దరం ఆస్పత్రిలో చేరాం. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరుతున్నాను. ధన్యవాదాలు" అని అభిషేక్ తెలిపాడు. అభిషేక్ క్లోజ్ ఫ్రెండ్, నటుడు రితేష్ దేశ్‌ముఖ్... త్వరగా కోలుకోవాలని కోరాడు. వీళ్లిద్దరూ... హౌస్‌ఫుల్ 3, బ్లఫ్‌మాస్టర్ సినిమాల్లో కలిసి చేశారు.


  అభిషేక్ బచ్చన్... ఈమధ్యే తొలిసారిగా వెబ్‌లో బ్రెత్ : ఇంటు ది షాడోస్ చేశాడు. అలాగే... డిస్నీ+హాట్‌స్టార్‌లో ది బిగ్ బుల్ కూడా చేయబోతున్నాడు. అలాగే... షారుఖ్ ఖాన్‌కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఓ సినిమాలో కనిపించనున్నాడు. అలాగే... భార్య ఐశ్వర్యరాయ్‌తో కలిసి... ల్యూడో అండ్ గులాబ్ జామ్ అనే సినిమాలో కూడా చేయబోతున్నాడు.  అటు అమితాబ్ బచ్చన్ 77 ఏళ్ల వయసులో కరోనా బారిన పడినట్లు శనివారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈమధ్యే ఆయన నానావతి ఆస్పత్రిలో చేరారు. గత 10 రోజులుగా తనను కలిసినవారంతా... కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు. తండ్రీ కొడుకు త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులు కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు.
  View this post on Instagram

  कैसे इतने बड़े हो गये ?!!😀


  A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on  ఇప్పటికే ముంబైలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. అక్కడ బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే టాలీవుడ్‌లో నిర్మాత పోకూరీ రామారావు కరోనాతో చనిపోయాడు. ఇక బాలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ కరోనాతోనే చనిపోయాడు. ఆయనతో పాటు మరో అరడజన్ మంది కూడా కోవిడ్ 19 కారణంగా కన్నుమూసారు. అందులో సీనియర్ నటులతో పాటు నిర్మాతలు కూడా ఉన్నారు. ఇప్పుడు అమితాబ్, అభిషేక్ కూడా కోవిడ్ బారిన పడటంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు