Amit Shah Covid Negative: అమిత్ షాకు కరోనా నెగిటివ్.. కొన్నాళ్లు హోం ఐసోలేషన్..

Amit shah Covid-19 Negative | కేంద్ర హోం మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కరోనా నెగిటివ్ వచ్చింది.

news18-telugu
Updated: August 14, 2020, 5:59 PM IST
Amit Shah Covid Negative: అమిత్ షాకు కరోనా నెగిటివ్.. కొన్నాళ్లు హోం ఐసోలేషన్..
హోం మంత్రి అమిత్ షా(ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కరోనా నెగిటివ్ వచ్చింది. కరోనా టెస్టుల్లో తనకు నెగిటివ్ రిపోర్టు వచ్చినట్టు ఆయన స్వయంగా వెల్లడించారు. ‘ఈ రోజు కరోనా పరీక్షల్లో నాకు నెగిటివ్ వచ్చింది. ఈశ్వరుడికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే, నా ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థించి, నా కుటుంబ క్షేమం కోసం కాంక్షించిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. డాక్టర్ల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లోనే ఉంటాను. కరోనా వచ్చిన తర్వాత నాకు ధైర్యం చెప్పిన వారు, అలాగే నాకు వైద్యం చేసిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అమిత్ షా రెండు ట్వీట్లు చేశారు. కరోనాతో బాధపడుతున్న అమిత్ షాకు టెస్టులు చేయగా, రిపోర్టులో నెగిటివ్ వచ్చినట్టు ఇటీవల ఓ బీజేపీ ఎంపీ ట్వీట్ చేశారు. అయితే, దీనిపై కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. అమిత్ షాపై ఆరోగ్యంపై ఎలాంటి వదంతులు నమ్మొద్దని స్పష్టం చేసింది. అమిత్ షా మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: August 14, 2020, 5:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading