Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..

అమిత్ షా ట్వీట్ చేయడంతో వరుసగా ప్రముఖులు ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. 

news18-telugu
Updated: August 2, 2020, 6:32 PM IST
Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..
అమిత్ షా
  • Share this:
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా సోకినట్టు అమిత్ షా స్వయంగా నిర్ధారించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స కోసం చేశారు. ‘కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో నేను టెస్టులు చేయించుకున్నా. అందులో రిపోర్టు పాజిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నా. కొన్ని రోజులుగా నాతో కలిసిన వారు మీరు కూడా టెస్టులు చేయించుకోండి. ఐసోలేషన్‌లో ఉండండి’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.



ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం గురుగ్రామ్ వెళ్లనున్నట్టు తెలిసింది. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో అమిత్ షా చికిత్స పొందుతున్నారు.



అమిత్ షా ట్వీట్ చేయడంతో వరుసగా ప్రముఖులు ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. అమిత్ షాకు కరోనా వైరస్ విషయం తెలిసిన వెంటనే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందించారు. ‘అమిత్ షాకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసి చాలా బాధించింది. ఆయన త్వరగా కోలుకోవాలి.’ అని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆకాంక్షించారు. ‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నుంచి త్వరగా కోలుకుని దేశానికి సేవలు అందించాలి.’ అని ఆమె ట్వీట్ చేశారు. అలాగే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అమిత్ షా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమిషా త్వరగా కోలుకుని దేశానికి సేవ చేయాలంటూ ట్వీట్ చేశారు.



భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 54735 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, యూపీ మంత్రి కమల్ రాణి కరోనాతో కన్నుమూశారు. నిన్న ఏపీలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో చనిపోయారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 2, 2020, 4:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading