మహారాష్ట్ర సీఎంకు అమిత్ షా ఫోన్.. ముంబైలో వలస కూలీల ఆందోళనపై ఆరా

మహారాష్ట్ర సీఎంకు అమిత్ షా ఫోన్.. ముంబైలో వలస కూలీల ఆందోళనపై ఆరా

వలస కూలీలను చెదరగొడుతున్న పోలీసులు

ఇవాళ్టితో లాక్‌డౌన్ ముగుస్తుందని భావించిన కూలీలు.. ప్రధాని మోదీ మే 3వరకు లాక్‌డౌన్ పొడిగిండచంతో రోడ్డెక్కారు. వేయి మందికి పైగా వలస కూలీలు బాంద్రా పశ్చిమ బస్ట్‌స్టేషన్ ముందు గుమిగూడారు. తమను ఇక్కడి నుంచి స్వస్థలాలకు పంపించాలంటూ నినాదాలు చేశారు.

 • Share this:
  ముంబైలో వేలాది వలస కూలీలు ఆందోళన చేసిన ఘటనపై దుమారం రేగుతోంది. భారీ సంఖ్యలో రోడ్డుపైకి చేరుకొని మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను వెంటనే స్వస్థాలకు పంపించాలని డిమాండ్ చేశారు. ఐతే ఈ ఘటనపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఫోన్ చేసి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనల వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని.. రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుంపులు గుంపుగా జనం పోగయితే.. కరోనాపై దేశం చేస్తున్న పోరాటం బలహీన పడుతుందని చెప్పారు. తమవైపు నుంచి అన్ని సహాయ సహకారాలు ఉంటాయని ఉద్ధవ్‌తో చెప్పారు అమిత్ షా.

  కరోనా కోరల్లో చిక్కుకున్న ముంబైలో వలస కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఇవాళ్టితో లాక్‌డౌన్ ముగుస్తుందని భావించిన కూలీలు.. ప్రధాని మోదీ మే 3వరకు లాక్‌డౌన్ పొడిగిండచంతో రోడ్డెక్కారు. వేయి మందికి పైగా వలస కూలీలు బాంద్రా పశ్చిమ బస్ట్‌స్టేషన్ ముందు గుమిగూడారు. తమను ఇక్కడి నుంచి స్వస్థలాలకు పంపించాలంటూ నినాదాలు చేశారు. వలస కూలీల్లో యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. పోలీసులు చేరుకొని వారిపై లాఠీచార్జి చేశారు. గుంపులు గుంపులుగా ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో.. వారిని చెదరగొట్టారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వలస కూలీలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బస్టాండ్ పరిసరాలు, రోడ్లను శానిటైజ్ చేశారు అధికారులు. ఒక్కసారిగా అంతమంది కూలీలు రోడ్లమ మీదకు ఎలా వచ్చాచరన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ఈ ఘటనను ఖండించిన మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. వలస కూలీలకు రేషన్ కార్డులు లేవని.. వారికి నిత్యావసర సరుకులు అందక ఇబ్బందిపడుతున్నారని విమర్శించారు. కనీసం తిండి లేక అల్లాడిపోతున్నారని అన్నారు. వలస కూలీలకు భరోసా ఇవ్వడంలో ఉద్ధవ్ సర్కార్ ఘోరంగా విఫలమైదని దుయ్యబట్టారు. వలస కార్మికుల అండంగా ఉండాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు ఫడ్నవీస్.

  మన దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. అందులోనూ ముంబై నగరంలోనే ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముంబైలో ఇప్పటి వరకు 1,753 కరోనా పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా పోరాడుతూ 111 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో ముంబైలో 204 కేసులు నమోదవగా.. 11 మంది చనిపోయారు. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవడం.. పదుల సంఖ్య ప్రజలు చనిపోతుండడంతో.. వలస కార్మికుల్లో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలోనే తమను స్వస్థలాలకు పంపించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు