Amit Shah on News18: కరోనా పోరాటంలో భారత్ గెలిచింది: అమిత్ షా

Amit Shah on News18: కరోనా పోరాటంలో భారత్ గెలిచింది: అమిత్ షా

న్యూస్ 18తో అమిత్ షా ఇంటర్వ్యూ

కరోనాను కట్టడి చేయడంలో మిగతా దేశాలతో పోల్చితే భారత్ మెరుగైన స్థానంలో ఉందని అమిత్ షా తెలిపారు.

  • Share this:
    కరోనాపై జరుగుతున్న పోరాటంలో భారత్ విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. మోదీ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయం ఇదేనని ఆయన చెప్పారు. నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో కరోనాపై భారత్ చేస్తున్న పోరాటంపై ఆయన మాట్లాడారు. కరోనాను కట్టడి చేయడంలో మిగతా దేశాలతో పోల్చితే భారత్ మెరుగైన స్థానంలో ఉందని చెప్పారు. ప్రభుత్వంతో పాటు 130 కోట్ల మంది ప్రజలు కూడా కరోనా మహమ్మారిపై పోరాటం చేశారని తెలిపారు అమిత్ షా.

    కరోనా కట్టడిలో భారత్ మెరుగ్గా ఉంది. మన దేశంలో ప్రతి లక్ష మందిలో 12.6 మంది మాత్రమే కరోనా బారినపడ్డారు. అమెరికా, బ్రెజిల్, యూకే వంటి దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. తాజా లెక్కల ప్రకారం భారత్ రికవరీ రేటు 42శాతంగా ఉంది.
    అమిత్ షా


    అంతకుముందు మోదీ 2.0 పాలనపై మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో 60 కోట్ల మంది జీవితాలు మారాయని అన్నారు. గత 60 ఏళ్లలో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందుకోని ప్రజలకు మోదీ పాలనలో ఎంతో లబ్ధి చేకూరిందని తెలిపారు అమిత్ షా. దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఆయన చెప్పారు. ఎన్డీయే పాలనలో రైతులు, మహిళలు, చిరువ్యాపారులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: