చైనాకు కరోనా షాక్ తప్పదా? వచ్చే వారం వెళ్తున్న WHO టీమ్... వైరస్ ఎలా వచ్చింది?

WHOపై చైనాకి వ్యతిరేకంగా అమెరికా ఒత్తిడి బాగా పనిచేసింది. కరోనా వైరస్ ఎలా పుట్టిందో తేల్చేందుకు WHO టీమ్ రంగంలోకి దిగబోతోంది.

news18-telugu
Updated: June 30, 2020, 11:19 AM IST
చైనాకు కరోనా షాక్ తప్పదా? వచ్చే వారం వెళ్తున్న WHO టీమ్... వైరస్ ఎలా వచ్చింది?
చైనాకు కరోనా షాక్ తప్పదా? వచ్చే వారం వెళ్తున్న WHO టీమ్... వైరస్ ఎలా వచ్చింది? (credit - NIAID)
  • Share this:
కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే అని ప్రపంచంలోని చిన్న పిల్లాణ్ని అడిగినా చెబుతాడు. కానీ... అది ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది? ఎందుకు పుట్టింది? దాని వెనక చైనా కుట్ర ఉందా? ఆ వైరస్‌ని చైనా ప్రభుత్వం... ల్యాబ్‌లో స్వయంగా తయారుచేయించిందా? ఇలా ఎన్నో అనుమానాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే... దాన్ని చైనా వైరస్ అని పిలిచి... దుమారానికి తెరతీశారు. ఐతే... చైనాలో పుట్టిన కరోనా వైరస్ వల్ల చైనాకి పెద్దగా నష్టం జరగలేదు కానీ... అమెరికా, బ్రెజిల్, భారత్ సహా చాలా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. చైనాపై నష్ట పరిహారం దావా వెయ్యాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే సోమ వారం... చైనాకి ప్రత్యేక టీమ్‌ని పంపబోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది.

ఈ టీమ్ రాకను అనుమతించాలని మే నుంచి WHO కోరుతున్నా... చైనా అనుమతి ఇవ్వలేదు. ఏ జంతువు నుంచి ఆ వైరస్ వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని WHO పట్టుపట్టింది. మూలం ఏంటో తెలిస్తే... వైరస్‌తో పోరాడేందుకు మరింత ఎక్కువ వీలు కలుగుతుందని WHO చీఫ్ టెండ్రోస్ అధానమ్ తెలిపారు. తమ టీమ్ మూలాన్ని కనుక్కుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆ టీమ్‌లో ఎవరెవరు ఉంటారనేది ఆయన చెప్పలేదు.

ఈ టీమ్ చైనాకి వెళ్లి... అక్కడి వేర్వేరు ప్రాంతాల్లో కరోనా వైరస్ శాంపిల్స్ సేకరిస్తుంది. అలాగే... అక్కడి అనుమానం ఉన్న జంతువుల్ని సేకరించి వాటిపై పరిశోధనలు చేస్తుంది. వైరస్‌లో జన్యువుల వంటివి... ఇతర జంతువుల్లో ఉన్నట్లు తేలితే... తద్వారా ఏ జంతువు నుంచి అది సోకిందో తెలిసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో చైనా కుట్ర పూరితంగా వైరస్‌ని సృష్టించిందా అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరికే అవకాశం ఉంటుంది.

2019 డిసెంబర్‌లో ఏదైనా జంతువు నుంచే ఈ కరోనా వైరస్... మనుషులకు సోకి ఉంటుందనే అనుమానాలు పరిశోధకులకు ఉన్నాయి. ముఖ్యంగా చైనా... వుహాన్‌లోని జంతువుల మార్కెట్ నుంచే అది వ్యాపించి ఉంటుందని చాలా మంది అన్నారు. దీనిపై చైనా ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. వైరస్ ఎలా పుట్టిందో తాము తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామనే ప్రతిసారీ చెబుతోంది. ప్రస్తుతం కరోనా కోటి మందికి పైగా సోకగా... 5 లక్షల మందికిపైగా చనిపోయారు.
First published: June 30, 2020, 11:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading