Home /News /coronavirus-latest-news /

AMID OMICRON FEARS INDIA LIKELY TO GO FOR BOOSTER DOSE EXPERT PANEL TO DECIDE TODAY MKS

Omicron : భారత్‌లోనూ ఒమిక్రాన్ విజృంభణ -బూస్టర్ డోసు, పిల్లలకు టీకాలపై నేడు నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. దేశంలో ఒకే రోజు 16 కొత్త కేసులు వచ్చాయి. తాజావాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 21కి పెరిగింది. రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకు కూడా ఒమిక్రాన్ సోకుతోన్న క్రమంలో దానిని కట్టడి చేయాలంటే మూడో డోసు.. అంటే, బూస్టర్ డోసు తప్పనిసరి అని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో బూస్టర్ డోసు పంపిణీపై భారత్ నిర్ణయం తీసుకోనుంది..

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారికి సంబంధించి, సెకండ్ వేవ్ లో లక్షల మందిని బలితీసుకున్న డెల్టా వేరియంట్ కంటే ఐదు రెట్లు ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ ఇప్పుడు ఇండియాలోనూ అలజడి పెంచింది. తొలి కేసును గుర్తించిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏకంగా 21కి పెరిగింది. ఇప్పటిదాకా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వ్యక్తుల ట్రావెల్ హిస్టరీ గమనిస్తే, రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వందల్లోకి చేరడం ఖాయంగా మారింది. ఒమిక్రాన్ వల్ల ఇప్పటిదాకా ఎవరూ చనిపోకున్నా, దాని లక్షణాలు స్వల్పంగా అనిపించినా, వ్యాప్తి పెరిగే కొద్దీ పరిస్థితి మరింత జఠిలం అవుతుందని, కచ్చితంగా ఇది ముప్పే కలిగించేదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకు కూడా ఒమిక్రాన్ సోకుతోన్న క్రమంలో దానిని కట్టడి చేయాలంటే మూడో డోసు.. అంటే, బూస్టర్ డోసు తప్పనిసరి అని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో దాదాపు 70కిపైగా దేశాలు తమ పౌరులకు బూస్టర్ డోసును అందిస్తున్నాయి. ఇటు భారత్ లోనూ బూస్టర్ డోసు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కీలక నిర్ణయం ఇవాళ సోమవారం వెలువడనుంది..

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ఇండియాలోనూ బూస్టర్ డోసు విధానాన్ని తీసుకొచ్చే దిశగా కేంద్ర సంస్థల నిపుణులు చర్చలు జరుపుతున్నారు. కోవిడ్-19 ఇమ్యునైజేషన్‌పై భారత నిపుణుల ప్యానెల్ సోమవారం నాడు సమావేశమై, బూస్టర్ డోసు విధివిధానాలను ఖరారు చేయనుంది. భారత్ లో బూస్టర్ డోసును పంపిణీ చేస్తే ముందుగా ఎవరికి ఇవ్వాలి? రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి, హై-రిస్క్ జోన్లో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తూనే ఆరోగ్యవంతులనూ కాపాడుకుంటూ బూస్టర్ డోసును ఎలా పంపిణీ చేయాలి? అనే విషయాలపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) ఇవాళ నిర్ణయాలు తీసుకోనుంది. ఇప్పటిదాకా మన దేశంలో రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ విధానం మాత్రమే అమలవుతున్నది.

ind-pak సరిహద్దులో పురుడు పోసుకున్న మహిళ -బుడ్డోడికి ‘బోర్డర్’అని పేరు -వాళ్లదిప్పుడు ఏ దేశం?ఈ ఏడాది జనవరి నుంచి భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, ఇప్పటికే 123 కోట్ల డోసుల్ని పంపిణీ చేశారు. అయితే, చాలా మంది రెండో డోసు తీసుకోడానికి ముందుకు రాకపోతుండటంతో వ్యాక్సిన్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారం ఇప్పటికే 25 కోట్ల డోసుల స్టాక్ ఉంది. నిర్ణీత గడువులోగా వీటిని వాడాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లు వృధా కాకుండా వాటిని మూడో డోసుగా, అంటే బూస్టర్ డోసులుగా అందిస్తే ఒమిక్రాన్ బారి నుంచి తప్పించుకునే వీలుంటుందని నిపుణులు ముందు నుంచీ వాదిస్తున్నారు. ఆ దిశగానే ఇవాళ్టి నిర్ణయం ఉండొచ్చని తెలుస్తోంది. ఇక,

cm jagan గాలి తీశారుగా! -విపక్షాలు కాదు, వైసీపీ సర్కారును మేమే కూల్చేస్తాం.. ఇవిగో ఓట్ల లెక్కలుభారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. దేశంలో ఒకే రోజు 16 కొత్త కేసులు వచ్చాయి. తాజావాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 21కి పెరిగింది. రాజస్థాన్ లో 9 కేసులు, మహారాష్ట్రలో 8, కర్ణాటకలో రెండు, గుజరాత్ లో రెండు, ఢిల్లీలో ఒక్క కేసు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 797 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. 44 ఏళ్ల మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నైజీరియాలోని లాగోస్ నుంచి గత నెల 24న పూణె చేరుకుంది. అనంతరం పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న తన సోదరుడి వద్దకు వెళ్లింది. ట్రావెల్ హిస్టరీని బట్టి వ్యక్తుల్ని గుర్తిస్తోన్న ప్రభుత్వ యంత్రాంగం.. ఆ మహిళను కలిసిన అందరి నుంచి శాంపిళ్లు తీసుకుని పూణెలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌లో పరీక్షలకు పంపగా, శనివారం నాడు ఫలితాలు వచ్చాయి. ఆ కుటుంబంలో మొత్తం ఆరుగురికి ఒమిక్రాన్ సోకింది. అలాగే, ఫిన్లాండ్ నుంచి పూణె వచ్చిన మరో వ్యక్తి (47)లోనూ ఒమైక్రాన్‌ను గుర్తించారు. ఫలితంగా ఒక్క మహారాష్ట్రలోనే ఒమైక్రాన్ కేసుల సంఖ్య 8కి పెరిగింది. మరోవైపు,

Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..కోవిడ్-19కి వ్యతిరేకంగా పిల్లలకు వ్యాక్సిన్ వేసే విషయాన్ని కూడా NTAGI ఆలోచిస్తుంది. పిల్లలకు వ్యాక్సిన్లు వేయడం గురించి ప్రారంభించడంపై ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ, దశలవారీగా కసరత్తు నిర్వహించే అవకాశం ఉందని, మొదటి దశలో అనారోగ్యాలతో బాధపడుతున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయమై ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Covid, COVID-19 vaccine, India, Omicron, Omicron corona variant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు