హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron: ఒమిక్రాన్ దెబ్బకు ఇండియాలో కరోనా మూడో వేవ్! -WHO నిపుణులు ఏమన్నారంటే..

Omicron: ఒమిక్రాన్ దెబ్బకు ఇండియాలో కరోనా మూడో వేవ్! -WHO నిపుణులు ఏమన్నారంటే..

దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.

దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.

భారత్ లో ఒమిక్రాన్ కేసులు ఆదివారం నాటికి 37కు పెరిగాయి. కొత్తగా ఏపీలో, చండీగఢ్, నాగపూర్ లో కేసులు వచ్చాయి. ఒమిక్రాన్ ఇలానే వ్యాప్తి చెందుతూ జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి నాటికి పీక్ దశకు చేరుతుందని, తద్వారా ఇండియాలో కరోనా మూడో వేవ్ తలెత్తి..

ఇంకా చదవండి ...

సౌతాఫ్రికా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. భారత్ లోనూ దీని వ్యాప్తి క్రమంగా పెరుగుతున్నది. సెకండ్ వేవ్ లో లక్షల మందిని బలితీసుకున్న డెల్టా వైరస్ కంటే ఒమిక్రాన్ ఐదు రెట్లు ప్రమాదకారి అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన నేపథ్యంలో ఆందోళనలు పెరిగాయి. భారత్ లో ఒమిక్రాన్ కేసులు ఆదివారం నాటికి 37కు పెరిగాయి. కొత్తగా ఏపీలో, చండీగఢ్, నాగపూర్ లో కేసులు వచ్చాయి. ఒమిక్రాన్ ఇలానే వ్యాప్తి చెందుతూ జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి నాటికి పీక్ దశకు చేరుతుందని, తద్వారా ఇండియాలో కరోనా మూడో వేవ్ తలెత్తినట్లవుతుందని, రోజుకు కనీసం 1లక్ష నుంచి 1.5లక్షల కొత్త కేసులు వస్తాయని కొందరు నిపుణులు హెచ్చరించారు.

కరోనా వల్ల భారత్ లో మూడో వేవ్ తలెత్తబోందన్న స్థానికి నిపుణుల అంచనాలకు భిన్నంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆగ్నేయ ఆసియా ఆసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ స్పందించారు. మహమ్మారి ఇంకా అంతం కాలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని, ప్రపంచదేశాల్లో నేటికీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఒమిక్రాన్ కొద్దికాలంలోనే ప్రపంచమంతా వ్యాపించడాన్ని బట్టి దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.

Depositors First: బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ రూ.5లక్షలకు పెంపు -PM Modi కీలక ప్రకటనఅయితే, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎలాంటి లక్షణాలు కలిగిస్తుంది? ఇన్ఫెక్షన్ తీవ్రత, విస్తరణ వంటి అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని డాక్టర్ పూన్ అన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి నిరోధానికి ప్రపంచ దేశాలు సహకరించాలని, ఒమిక్రాన్ వేరియంట్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించాలని సూచించారు. 'మహమ్మారి ఇంకా చుట్టూ ఉంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న కేసులు, కొత్త వేరియంట్ల ఆవిర్భావం దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ప్రమాదం ఎక్కువ ఉంది' అన్నారు. దక్షిణాఫ్రికా నుంచి అందిన సమాచారం మేరకు.. ఒమిక్రాన్‌ వేరియంట్ ద్వారా రీఇన్ఫెక్షన్లు కలుగుతున్నాయని తెలిపారు.

Hyderabad : సెలైన్‌తో విషం ఎక్కించుకుని.. యువ డాక్టర్ ఎందుకిలా చేశాడు?ప్రస్తుతానికి ఒమిక్రాన్ వేరియంట్ లో డెల్టా వేరియంట్ కంటే తక్కువ స్థాయిలోనే లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పుడిప్పుడే దీనిపై ఎలాంటి అంచనాలకు రాలేమని డాక్టర పూనమ్ స్పష్టం చేశారు. ఒమిక్రాన్ విషయంలో దక్షిణాసియా ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నిఘా, ప్రజారోగ్యం, సామాజిక చర్యలను బలోపేతం చేయడం కొనసాగించాలని, టీకా కవరేజీని వేగంగా పెంచాలని సూచించారు. ఒమిక్రాన్ కారణంగా భారత్‌లో థర్డ్ వేవ్ వస్తుందా? అనే అంశంపై కొంత అనిశ్చితి ఉందని తెలిపారు.

First published:

Tags: Covid, India, Omicron, Omicron corona variant

ఉత్తమ కథలు