AMID COVID SITUATION ANDHRA PRADESH JAGAN GOVT EXTENDS NIGHT CURFEW UNTIL FEBRUARY 14 MKS
Night Curfew in AP: ఏపీలో కరోనా విలయం.. నైట్ కర్ఫ్యూ పొడగింపు.. ఎప్పటివరకంటే..
ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడగించారు. ఈ నెల 14 వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని జగన్ సర్కారు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ కర్ఫ్యూ ఉండనుంది.
దేశంలో కరోనా వైరస్ మూడో వేవ్ ఉధృతి తగ్గినట్లు కనిపిస్తున్నా, రోజువారీ మరణాలు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. నిన్న ఒక్కరోజే 1192 మంది కొవిడ్ కాటుకు బలయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం, రోజువారీ కేసులు భారీగా వస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కట్టడి కోసం ఏపీ సర్కారు అమలు చేస్తోన్న నైట్ కర్ఫ్యూను పొడిగించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడగించారు. ఈ నెల 14 వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
ఏపీలో నిత్యం 10 వేలకు చేరువలో కేసులు వచ్చాయి. కొత్త కేసులు భారీగా కేసులు భారీగా తగ్గినా మరణా సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను రాష్ట్రంలో పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా సూచనలు చేసింది.
ఏపీ వైద్యారోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 5,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తొమ్మిది మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22, 76,370 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 21,51,238 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 14,615 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.