మీ వల్లే కరోనా వచ్చింది.. భారత్‌పై నేపాల్ తీవ్ర వ్యాఖ్యలు

భారత్‌లోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా తమ భూభాగాలేనని స్పష్టం చేశారు కేపీ శర్మ. రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వీటిని భారత్‌ నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

news18-telugu
Updated: May 20, 2020, 7:51 PM IST
మీ వల్లే కరోనా వచ్చింది.. భారత్‌పై నేపాల్ తీవ్ర వ్యాఖ్యలు
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి
  • Share this:
భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం జరుగుతున్న వేళ.. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనాను అడ్డంపెట్టుకొని భారత్‌పై నిందలు వేశారు. తమ దేశంలో కరోనా వ్యాప్తికి భారత్ దేశమే కారణమని పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. భారత్ నుంచి జనాలు వస్తుండడంతో కరోనాను కట్టడి చేయడం కష్టంగా మారిందని ఆయన అన్నారు. అంతేకాదు చైనా, ఇటలీ కరోనా వైరస్ కంటే భారత్‌లోని వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించారు.

భారత్‌ నుంచి అక్రమ మార్గాల్లో వస్తున్న వారి ద్వారానే నేపాల్‌లో వైరస్‌ వ్యాపిస్తోంది. సరైన పరీక్షలు చేయకుండానే అధికారులు, పార్టీ నాయకులు వారిని అనుమతిస్తున్నారు. బయట నుంచి జనాలు వస్తుండటంతో కరోనాను కట్టడి చేయడం కష్టమవుతోంది. ఇటలీ, చైనాతో పోలిస్తే భారత వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది.
కేపీ శర్మ ఓలి


అటు భారత్‌లోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా తమ భూభాగాలేనని స్పష్టం చేశారు కేపీ శర్మ. రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వీటిని భారత్‌ నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. మానసరోవర్ యాత్ర కోసం.. ఉత్తరాఖండ్‌లోని ధర్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌ కనుమతో కలుపుతూ భారత్‌ రోడ్డు నిర్మించడంపై నేపాల్ అభ్యంతర వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై తమ దేశంలోని భారత రాయబారికి నోటీసులు పంపించింది. అంతేకాదు ఈ మూడు ప్రాంతాలను తమ దేశ అంతర్గత భూభాలుగా చూపుతూ రూపొందించిన కొత్త మ్యాప్‌ను ఇటీవల నేపాల్ కేబినెట్ ఆమోదించింది.
First published: May 20, 2020, 7:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading