చైనాకు మూడినట్లే?... కరోనాపై ట్రంప్ ఫుల్ సీరియస్... వడ్డీతో సహా వసూలు చేస్తారా?

అమెరికాలో రోజూ లక్ష దాకా కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని తేలడంతో... అధ్యక్షుడు ట్రంప్... చైనాపై మరోసారి ఘాటుగా విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: July 1, 2020, 8:00 AM IST
చైనాకు మూడినట్లే?... కరోనాపై ట్రంప్ ఫుల్ సీరియస్... వడ్డీతో సహా వసూలు చేస్తారా?
డొనాల్డ్ ట్రంప్ (File)
  • Share this:
కరోనా ప్రారంభమైన చైనాలో... అది దాదాపు లేనట్లుగా ఉంటే... కరోనాతో ఏ సంబంధమూ లేని అమెరికా మాత్రం... ఆరు నెలలుగా అల్లకల్లలమవుతోంది. తాజాగా అక్కడ ఒకే రోజులో 46042 కొత్త కేసులు రావడం, నిన్న ఒక్క రోజే 764 మంది చనిపోవడంతో... తీవ్ర కలకలం రేగింది. అమెరికాలో రోజుకు లక్ష దాకా కొత్త కేసులు వచ్చే ప్రమాదం ఉందనే నిపుణుల హెచ్చరికలతో అక్కడి ప్రజలు మరింత భయపడుతున్నారు. ఈ అంశంపై తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ట్రంప్... మరోసారి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దారుణంగా వ్యాపించింది. అది అమెరికాకు అత్యంత ఎక్కువ నష్టం కలిగించింది. నాకు చైనాపై అత్యంత తీవ్రంగా కోపం ఉంది. ప్రజలు దీన్ని చూస్తున్నారు. నేను దీన్ని ఫీల్ అవుతున్నాను" అని ట్రంప్ తాజాగా ట్వీట్ చేశారు.


ట్రంప్ ఇలా అనడంలో కొంత న్యాయం ఉంది. ఎందుకంటే... ప్రపంచంలో కరోనా వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయిన దేశం అమెరికాయే. అక్కడ మొత్తం 27 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. వారందరికీ ట్రీట్‌మెంట్ అనేది ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇక ఆస్పత్రుల్లో సదుపాయాలు, PPE కిట్లు, మందులు, ఆహార ఖర్చులు లెక్కలకు అందనంత స్థాయిలో ఉంటాయి. దీనికి తోడు ఆర్థికంగా అమెరికాకు ఎక్కడ లేని నష్టం జరుగుతోంది. దీనంతటికీ కారణం చైనాయే అని ట్రంఫ్ భగ్గుమంటున్నారు.

తాజాగా చైనాలోనే మరో భయంకరమైన వైరస్ వెలుగులోకి రావడంతో... ప్రపంచ దేశాలన్నీ "ఏం చైనారా బాబూ... మా ప్రాణాలు తీస్తోంది" అని ఆవేదన చెందుతున్నారు. "ఆ పందులు, కుక్కల్ని తినడం మానొచ్చుగా" అని ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఆ కొత్త వైరస్ పందుల నుంచే మనుషులకు సోకుతోంది మరి.ప్రస్తుతం భారత్‌ సరిహద్దుల్లో కుట్రలు పన్నుతున్న చైనాపై ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. కరోనా చైనా వల్లే వ్యాపించిందనే ఆలోచనతో పట్టరాని కోపంతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఉన్నా చైనా మాత్రం తన చుట్టూ ఉన్న దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకుంటోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతినిధులు... చైనాలో కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టిందో తెలుసుకోబోతున్నారు. ఒక వేళ చైనా స్వయంగా ల్యాబ్‌లో ఆ వైరస్‌ని తయారుచేసిందనే ప్రచారమే నిజమని తేలితే... ప్రపంచ దేశాలు చైనాపై భారీ ఎత్తున పరిహార కేసులు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా యుద్ధాన్నే ప్రకటించినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఐతే... చైనా... ఆ వైరస్‌ని అమెరికాయే పుట్టించిందని అంటోంది. WHO కూడా అది సహజంగానే పుట్టి ఉండొచ్చని అంటోంది. మొత్తంగా చైనా... వైరస్‌ల దేశంగా గుర్తింపు పొందుతోంది.
First published: July 1, 2020, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading