మాట మార్చిన ట్రంప్... చైనాకు కితాబు

కరోనా కారణంగా అమెరికా, చైనా మధ్య ఉన్న గ్యాప్ మరింతగా పెరుగుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల అధ్యక్షులు ఈ అంశంపై మాట్లాడుకోవడం సానుకూలమైన అంశమే అనే వాదన వినిపిస్తోంది.

news18-telugu
Updated: March 27, 2020, 2:16 PM IST
మాట మార్చిన ట్రంప్... చైనాకు కితాబు
డోనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... సడన్‌గా మాట మార్చేశారు. నేడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో మాట్లాడిన ట్రంప్... ఆయనతో మాట్లాడిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆయనతో సంభాషణ బాగా జరిగిందని అన్నారు. ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్ కూడా విస్తృతంగా చర్చించామని ట్రంప్ వివరించారు. చైనాకు ఈ వైరస్ విషయంలో ఎంతో అవగాహన ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇద్దరం కలిసి పని చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇద్దరం పరస్పరం గౌరవంగా వ్యవహరిస్తామని తెలిపారు.కరోనా వైరస్ కారణంగా అమెరికా తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో... ఈ వైరస్ పుట్టినట్టు భావిస్తున్న చైనాపై ట్రంప్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ను ఏకంగా చైనీస్ వైరస్ అంటూ కామెంట్ చేశారు. ఇందుకు కౌంటర్ ఇచ్చిన చైనా... అమెరికా సైన్యమే దీన్ని వూహాన్ తీసుకొచ్చిందని వ్యాఖ్యానించింది. దీంతో కరోనా కారణంగా ఇరు దేశాల మధ్య ఉన్న గ్యాప్ మరింతగా పెరుగుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల అధ్యక్షులు ఈ అంశంపై మాట్లాడుకోవడం సానుకూలమైన అంశమే అనే వాదన వినిపిస్తోంది.First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading