మీరు స్మార్ట్ టీవీ వాడుతున్నారా? మీ టీవీలో సినిమాలు చూస్తున్నారా? సినిమా క్లారిటీ కోసం హెచ్‌డీ, అల్‌ట్రా హెచ్‌డీ కంటెంట్ చూస్తున్నారా? అయితే మీకు షాకే. ఇకపై మీరు హెచ్‌డీ లేదా అల్‌ట్రా హెచ్‌డీ కంటెంట్ చూడలేరు. కేవలం ఎస్‌డీ కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందుకు కారణం... కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభమే. కరోనా వైరస్‌కు హెచ్‌డీ కంటెంట్‌కు సంబంధం ఏంటా అనుకుంటున్నారా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో స్మార్ట్‌ఫోన్‌లో డేటా వినియోగం, ఇంటర్నెట్ డేటా వినియోగం బాగా పెరిగింది. ఇంటర్నెట్‌కు డిమాండ్ కూడా బాగా పెరిగింది.
కొన్ని రోజులుగా డేటాకు డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం ఉన్న సెల్యులార్ నెట్వర్క్ మౌలిక వసతులపై తీవ్రమైన భారం పడుతోంది. ఈ పరిస్థితి ప్రభుత్వంతో పాటు టెలికామ్ ఆపరేటర్లలో ఆందోళన పెంచింది. ప్రస్తుతం వారికి ఇదో సవాల్‌గా మారింది. ఈ సమస్యకు పరిష్కారం కోసం స్టార్ అండ్ డిస్నీ ఇండియా ఛైర్మన్ ఉదయ్ శంకర్ డిజిటల్ ఇండస్ట్రీలోని సంస్థలతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్‌పీ సింగ్ (Sony), సంజయ్ గుప్తా (Google), అజిత్ మోహన్ (Facebook), సుధాన్షు వత్స్ (Viacom18), గౌరవ్ గాంధీ (Amazon Prime Video), పునీత్ గోయెంకా (Zee), నిఖిల్ గాంధీ (Tiktok), అంబికా ఖురానా (Netflix), కరణ్ బేడీ (MX Player), వరుణ్ నారంగ్ (Hotstar) పాల్గొన్నారు.
సెల్యులార్ నెట్వర్క్‌ను పటిష్టంగా ఉంచడంతో పాటు వినియోగదారులు, దేశం అవసరాలను దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అన్ని కంపెనీలు డిఫాల్ట్‌గా ఇచ్చే హెచ్‌డీ కంటెంట్, అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ను ఎస్‌డీ కంటెంట్‌కు మార్చాలని, సెల్యులార్ నెట్వర్క్‌లో 480పీ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించాయి. ఏప్రిల్ 14 వరకు ఈ పద్ధతి అమలు చేయాలని నిర్ణయించాయి. కాబట్టి అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో హెచ్‌డీ కంటెంట్ రాకపోతే కంగారుపడకండి. ఏప్రిల్ 14 వరకు ఇంతే.
ఇవి కూడా చదవండి:
సినిమాలు చూడాలా? అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 ఫ్రీగా పొందండి ఇలా
ATM: ఏటీఎంకు వెళ్లకుండా ఇంటికే డబ్బులు తెప్పించుకోండి ఇలా...
Work From Home: మీ వైఫై స్పీడ్‌ని పెంచే 9 టిప్స్ ఇవే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Amazon prime, Cinema, Corona, Corona virus, Coronavirus, Covid-19, Facebook, Google, Hotstar, Lockdown, Netflix, Sony, Tiktok, Zee5