అక్కడ హోమ్ డెలివరీ సేవలు బంద్.. అమెజాన్ సంచలన నిర్ణయం

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది అమెజాన్. దీనికి వినియోగదారులంతా సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

news18-telugu
Updated: March 17, 2020, 10:02 PM IST
అక్కడ హోమ్ డెలివరీ సేవలు బంద్.. అమెజాన్ సంచలన నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలు స్తంభించిపోయాయి. కనీసం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. బయటకు వెళ్లి నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా సాధ్యంపడడం లేదు. ఈ క్రమంలో చాలా మంది ఈ-కామర్స్ సంస్థలనే నమ్ముకున్నారు. తమకు కావాల్సిన వస్తువులను ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఐతే ఇకపై అమెరికాలో అది కూడా సాధ్యపడేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో హోమ్ డెలివరీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 5 వరకు ఇది కొనసాగుతుందని వెల్లడించింది.

ఐతే వైద్య సంబంధిత వస్తువువులు, నిత్యావసరాలు, డిమాండ్ ఎక్కవగా ఉన్న వస్తువులను మాత్రం యథావిధిగా సరఫరా చేస్తామని వెల్లడించింది అమెజాన్. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి వినియోగదారులంతా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 5,636 కేసులు నమోదయ్యాయి. సుమారు వంద మంది మృత్యువాతపడ్డారు. 74 మంది కరోనావైరస్‌ నుంచి కోలుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
First published: March 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading