Home /News /coronavirus-latest-news /

AMARAVATI MP AND ACTRESS NAVNEET KAUR HEALTH DETERIORATED DUE TO CORONA VIRUS AK

Navneet Kaur: క్షీణించిన ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం.. కరోనా సోకడంతో..

ఎంపీ నవనీత్ కౌర్(ఫైల్ ఫోటో)

ఎంపీ నవనీత్ కౌర్(ఫైల్ ఫోటో)

Navneet Kaur: కొద్ది రోజుల క్రితం నవనీత్ కౌర్‌తో పాటు ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రానాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

    తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రస్తుతం మహారాష్ట్రలోని అమరావతి ఎంపీగా వ్యవహరిస్తున్న నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆమెను వెంటనే నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం నవనీత్ కౌర్‌తో పాటు ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రానాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వారితో పాటు వారి కుటుంబంలోని మొత్తం 11 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో వీరి పిల్లలు కూడా ఉన్నారు.

    తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో... తనను కలిసిన వారంతా కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించిన సంగతి తెలిసిందే. 2019లో బీజేపీ తరపున అమరావతి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ నవనీత్ కౌర్... స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Navneet Kaur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు