హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ముస్లింలకు పర్సనల్ లా బోర్డు ముఖ్య సూచన...

ముస్లింలకు పర్సనల్ లా బోర్డు ముఖ్య సూచన...

ఇక ఈ ఏడాది సామూహిక ఈద్ ప్రార్థనలకు సైతం అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇక ఈ ఏడాది సామూహిక ఈద్ ప్రార్థనలకు సైతం అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. భారత్‌లో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ క్రమంలో బయటకు ప్రజలు ఎవరూ రావొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదే సమయంలో ముస్లింలకు ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా కీలక సూచన చేసింది. ముస్లింలు ప్రార్థనల కోసం బయటకు రావొద్దని, ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని పిలుపునిచ్చింది. ‘కరోనా మహమ్మారి తాండవిస్తున్న సమయంలో సామూహిక ప్రార్థనల కోసం మసీదుకు రావొద్దు. ఇంటివద్దే ప్రార్థనలు చేసుకోండి. తోటి పౌరులకు హాని జరగకుండా చూడడం మన బాధ్యత.’ అని ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచించింది. అదే సమయంలో మసీదులను నిర్మానుష్యంగా వదిలేయవద్దని కోరింది. మసీదులో నలుగురు వరకు ఉండొచ్చని, ఆ నలుగురు మసీదులో ప్రార్థనలు చేసుకోవచ్చని సూచించింది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Coronavirus, Lockdown, Muslim Minorities

    ఉత్తమ కథలు