ఆ గ్రామం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను 100 శాతం అమలు చేస్తుంది. కరోనా కట్టడిలో కూడా ఆ గ్రామం ముందుంది. 40 ఏళ్లకు పై బడిన అర్హులందూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో తొలివిడుత వందశాతం కరోనా వ్యాక్సినేషన్ జరిగిన గ్రామంగా రికార్డు సృష్టించింది. మొదట్లో ప్రభుత్వం అందరికీ టీకాలు ఇవ్వలేదు. కేవలం 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే పంపిణీ చేసింది. ఆ తర్వాత 40 ఏళ్ల పైపడిన వారికి వ్యాక్సిన్ ఇస్తోంది. దీంతో వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ పీహెచ్ సీ పరిధిలోని మరియపురం గ్రమ సర్పంచ్ బాల్ రెడ్డి అర్హత గల వారందరూ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత 60ఏండ్లు పైబడిన వారు, అనంతరం 40 ఏం డ్లు పైబడిన వారు మొత్తం 314మంది అర్హులు ఉన్నట్లు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో ఎవరూ టీకా తీసుకునేందుకు రాలేదు. భయపడేవారు. అయితే తనే టీకా తీసుకొని వారిలో భయాన్ని తొలగించాలనుకున్నాడు. మార్చి 6 న తొలిడోస్ టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఊర్లో వాళ్లకు తెలియజేయలనుకొని.. ఒక ఊరికి సంబంధించి గ్రూప్ ను క్రియోట్ చేశాడు.
అందులో తను వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఫొటో, సమాచారం షేర్ చేశాడు. టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదని తెలియజేశాడు. వైరస్ నుంచి రక్షణ పొందెందుకు టీకా ఉపయోగపడుతుందని ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాడు. అతని ప్రయత్నం ఊరికే పోలేదు. తెల్లారేసరికి 60 ఏళ్ల పైడిన గ్రమస్తులు గీసుకొండ పీహెచ్ సీకి వెళ్లి టీకీ వేసుకున్నారు. మొదట 60 మంది వేసుకోగా తదుపరి రోజు మరో 60 మందికి తొలి డోసు టీకా వేసుకున్నారు. దాని కోసం సర్పంచ్ ప్రత్యేకంగా రవాణా సౌకర్యం కూడా కల్పించాడు. కొదరు స్వచ్ఛందంగా వెళ్లి టీకా వేసుకున్నారు. దీని తర్వాత గ్రమాస్తుల్లో నమ్మకం పెరిగింది. 40 ఏళ్ల పైబడిని వరికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమంలో కూడా ఇతడు విజయవంతం అయ్యాడు. . గ్రామంలో 174మంది ఉన్నట్లు గుర్తించిన సర్పంచ్ గీసుగొండ పీహెచ్‌సీలో వ్యాక్సిన్ వేసుకునేలా మరో ప్లాన్ చేశారు. అందరితో మాట్లాడి 4, 5తేదీల్లో బస్సు, మినీవ్యాన్ ఏర్పాటు చేశారు. తొలిరోజు 60 మంది, రెండోరోజు 60 మందికి వ్యాక్సిన్ వేయించారు. మరో 54మంది ఈ నెల 15వ తేదీన వ్యాక్సిన్ వేసుకున్నట్లు వైద్యు లు తెలిపారు.
దీంతో మొత్తం మరియపురంలో ఉన్న వారంతా 314 మంది వ్యాక్సిన్ వేసుకొని 100 శాతం టీకా అమలు చేసిన తొలి గ్రామంగా రికర్డ్ కు ఎక్కింది. దీంతో అదికారలు సర్పంచ్ ను, గ్రామ ప్రజలను ప్రశంసలతో ముంచెత్తారు. మరియపురం గ్రామస్తులను ఆదర్శంగా తీసుకుని ఇతర గ్రామాల్లోని 40ఏండ్లుపైబడిన వారు కూ డా వ్యాక్సిన్ వేసుకునేందుకు స్వచ్ఛందం గా ముందుకొస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదని .. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ తీసుకోవచ్చని సర్పంచ్ సూచించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 100 percent vaccination vilalge, Covaxin, Covid vaccine, Covid-19, Geesukonda mandalam, Mariyapuram, Telangana, Warangal rural district