news18-telugu
Updated: June 25, 2020, 4:30 PM IST
ATM Rules: జూలై 1 నుంచి ఏటీఎం విత్‌డ్రా రూల్స్ మారే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా బ్యాంకులు తమ కస్టమర్లకు అనేక సడలింపులు ఇచ్చాయి. ఏటీఎం నగదు విత్‌డ్రా నిబంధనల్ని మార్చి కస్టమర్లకు ఊరట కలిగించాయి. లాక్డౌన్ సమయంలో ప్రజలు నగదు లేకుండా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో బ్యాంకులు పలు నిర్ణయాలు తీసుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎం సర్వీస్ ఛార్జీలను తొలగించింది. అంటే ఉచిత ట్రాన్సాక్షన్స్ తర్వాత ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే ప్రతీ సారి సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉండేది. కానీ లాక్డౌన్ కాలంలో ఈ ఛార్జీలను తొలగించింది ఎస్బీఐ. ఎస్బీఐ ఏటీఎంలు మాత్రమే కాదు, ఇతర బ్యాంకుల ఏటీఎంలో డ్రా చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది. అయితే 2020 జూన్ 30 వరకు ఏటీఎం సర్వీస్ ఛార్జీలు లేవని ముందే స్పష్టం చేసింది. ఎస్బీఐ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నాయి. వాటిని జూన్ 30 వరకు అమలు చేస్తామని ప్రకటించాయి. జూన్ 30 గడువు దగ్గరకొచ్చింది. ఇప్పటివరకైతే ఈ సడలింపుల పొడిగింపుపై బ్యాంకుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి జూలై 1 నుంచి గతంలో ఉన్న ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్ రూల్స్ అమలులోకి వచ్చే అవకాశముంది.
జూలై 1 నుంచి అన్ని బ్యాంకులు తమ ఏటీఎం విత్‌డ్రాయల్ నిబంధనల్ని తిరిగి అమలు చేయొచ్చు. అదే జరిగితే కస్టమర్లకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ తగ్గిపోతుంది. ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ గతంలో ఉన్నట్టే ఉంటుంది. ఎస్బీఐ విషయానికొస్తే మెట్రో నగరాల్లో రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి 8 ఉచిత ట్రాన్సాక్షన్స్‌ని ఇస్తోంది బ్యాంకు. 5 సార్లు ఎస్బీఐ ఏటీఎంలల్లో, 3 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాలి. నాన్ మెట్రోలో 8 ఉచిత ట్రాన్సాక్షన్స్‌ని ఇస్తోంది ఎస్బీఐ. 5 సార్లు ఎస్బీఐ ఏటీఎంలల్లో, 5 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇంతన్నా ఎక్కువసార్లు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే ప్రతీ లావాదేవీపై రూ.20+జీఎస్టీ చెల్లించాలి. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్‌కు రూ.8+జీఎస్టీ చెల్లించాలి.
First published:
June 25, 2020, 4:30 PM IST