భారీ వర్షంలోనూ మందు బాబుల క్యూ.. పిడుగులు పడినా కదిలేది లేదు..

మీ అకింత భావానినికి సెల్యూట్ అందరూ కొందరు సరదాగా అభిప్రాయపడ్డారు. వడగళ్లు కాదు.. పిడుగులు పడినా, ముందు బాటిల్ సాధించనదిదే అక్కడి నుంచి కదిలేదు లేదంటూ ఇంకొందరు ట్వీట్ చేస్తున్నారు.

news18-telugu
Updated: May 5, 2020, 7:45 PM IST
భారీ వర్షంలోనూ మందు బాబుల క్యూ.. పిడుగులు పడినా కదిలేది లేదు..
భారీ వర్షంలోనూ మందు బాబుల క్యూ.. పిడుగులు పడినా కదిలేది లేదు..
  • Share this:
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరచుకోవడంతో.. మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. ఉదయాన్నే లేచి లిక్కర్ షాప్‌ల ముందు క్యూలు కడుతున్నారు. ఎప్పుడెప్పుడు తమ వంతు వస్తుంది.. ఎప్పుడు తమ చేతిలో మందుబాటిల్ పడుతోందని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కరోనాకు వారు భయపడడం లేదు. మండటెండలను కూడా లెక్క చేయడం లేదు. గంటల తరబడి ఎంతో ఓపికతో క్యూలైన్లో నిలబడుతున్నారు. మద్యం కోసం దేనికైనా సిద్ధమన్న విధంగా తెగిస్తున్నారు. ఐతే ఉత్తరాండ్‌లోని నైనిటాల్‌లో భారీ వర్షం, ఈదురుగాలులోనూ మద్యం ప్రియులు క్యూలో నిలబడ్డారు. గొడుగులు చేతిలో పట్టుకొని... సామాజిక దూరం పాటిస్తూ.. వర్షంలో తడుస్తూ మద్యం కోసం క్యూలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మీ అకింత భావానినికి సెల్యూట్ అందరూ కొందరు సరదాగా అభిప్రాయపడ్డారు. వడగళ్లు కాదు.. పిడుగులు పడినా, ముందు బాటిల్ సాధించనదిదే అక్కడి నుంచి కదిలేదు లేదంటూ ఇంకొందరు ట్వీట్ చేస్తున్నారు. మరికొందరైతే వారిని తిడుతూ కామెంట్లు పెట్టారు. మీకేమైనా పిచ్చిపట్టింది.. మద్యానికి అంతలా ఎందుకు బానిసయ్యారంటూ విమర్శిస్తున్నారు.
First published: May 5, 2020, 7:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading