మద్యం తాగితే.. కరోనావైరస్ ముప్పు ఎక్కువ.. WHO హెచ్చరిక

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కరోనా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చునని గతంలో కొందరు చెప్పిన అంశా ల్లో ఎలాంటి వాస్తవం లేదని డబ్ల్యుహెచ్ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

news18-telugu
Updated: April 20, 2020, 3:53 PM IST
మద్యం తాగితే.. కరోనావైరస్ ముప్పు ఎక్కువ.. WHO హెచ్చరిక
క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.
  • Share this:
మందు బాబులకు కరోనా ముప్పు ఎక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) హెచ్చరించింది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కరోనా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చునని గతంలో కొందరు చెప్పిన అంశా ల్లో ఎలాంటి వాస్తవం లేదని డబ్ల్యుహెచ్ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. మద్యం తాగడం వల్ల కోవిడ్ ప్రభావం మరింత ప్రమాదకరంగా మారుతుందని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కరోనా లాక్‌డౌన్ సమయంలో మద్యం వినియోగాన్ని పరిమితం చేయాలని సిఫారసు చేసింది. ఆల్కహాల్ తాగితే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపడుతుందనీ, తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ పేర్కొంది. అంతేకాదు ఆల్కహాల్ తాగడం వల్ల కరోనావైరస్‌ను చంపుతుందని అపోహలపై WHO ఒక ఫ్యాక్ట్ షీట్‌ను కూడా ప్రచురించింది.

మద్యం సేవించడం కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు మరణానికి కూడా దారితీస్తుందని తెలిపింది. ప్రత్యేకించి మిథనాల్‌తో కల్తీ అయితే మాత్రం.. ఏడాదిలో సుమారుగా 30 లక్షల మరణాలు మహమ్మారికి కారణంగా నమోదయ్యే ప్రమాదం ఉందని WHO హెచ్చరిస్తోంది. అందుకే ప్రజలు మద్యపానాన్ని తగ్గించాలి. ముఖ్యంగా COVID-19 మహమ్మారి సమయంలో మద్యానికి దూరంగా ఉండాలని WHO కార్యాలయం తెలిపింది.

అయితే మద్యం దొరక్క పోవడంతో అమెరికన్లు మద్యాన్ని భారీగా నిల్వ చేస్తున్నారు. నీల్సన్ గణాంకాల ప్రకారం.. U.S మద్యం దుకాణాల్లో ఆల్కహాల్ అమ్మకాలు మార్చి 28తో ముగిసినప్పటికీ వారంలో 22శాతం పెరిగాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రాబోబాంక్ ప్రకారం.. ఎక్కువ మంది అమెరికన్లు ఇంట్లోనే మద్యం సేవిస్తున్నారు. తద్వారా ఆన్-సైట్ డైనింగ్, డ్రింకింగ్ మార్కెట్ రాబోయే రెండు నెలల్లో 15 బిలియన్ డాలర్ల మద్యం అమ్మకాలను కోల్పోతుంది. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇంట్లోనే ఉండాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ Antonio Guterres ఈ నెల ప్రారంభంలో హెచ్చరించారు. ప్రపంచంలో కరోనా వ్యాప్తితో సామాజిక ఆర్ధిక ఒత్తిడితో పాటు కదలికపై ఆంక్షలు విధించడం ద్వారా అన్నీంటిపై దుర్వినియోగం పెరగడానికి కారణమవుతాయని ఆయన అన్నారు.

లాక్ డౌన్ చర్యలతో శారీరకంగా, మానసికంగా ఎలా ఆరోగ్యంగా ఉండాలనే దానిపై WHO డైరెక్టర్ జనరల్ Tedros Adhanom Ghebreyesus గత నెలలో సలహా ఇచ్చారు. ‘ఈ క్లిష్ట సమయంలో మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలికంగా మీకు ఎంతో సహాయం చేయడమే కాదు. ఆరోగ్యంగా ఉన్నవారంతా COVID-19తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది’ అని టెడ్రోస్ అన్నారు.
Published by: Krishna Adithya
First published: April 20, 2020, 3:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading