'PM CARES సాధించిన విజయం ఇదే.. అన్ని ప్రశ్నలకు సమాధానం'

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేవలం 47వేల వెంటిలేటర్లే ఉన్నాయి. కానీ పీఎం కేర్స్‌తో అదనంగా ఒకేసారి 50వేల వెంటిలేటర్లను సమకూర్చుకోగలిగామని అఖిలేష్ మిశ్రా ట్విటర్ థ్రెడ్‌లో పేర్కొన్నారు.

news18-telugu
Updated: June 15, 2020, 3:11 PM IST
'PM CARES సాధించిన విజయం ఇదే.. అన్ని ప్రశ్నలకు సమాధానం'
ప్రధాని మోదీ
  • Share this:
కరోనాపై పోరాటం కోసం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పీఎమ్ కేర్స్‌(PM CARES) ఫండ్‌పై ఎన్నో విమర్శలున్నాయి. ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) ఉండగా.. పీఎం కేర్స్ ఎందుకు ఏర్పాటు చేశారు? ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి? అనే విపక్షాలు అనేక సార్లు మండిపడ్డాయి. పీఎం కేర్స్ నిధులన్నీ బీజేపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. ఐతే పీఎం కేర్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈవో అఖిలేష్ మిశ్రా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం...పీఎం కేర్స్‌కు వచ్చిన నిధుల్లో రూ.2000 కోట్లను 50వేల మేడిన్ ఇండియా వెంటిలేటర్ల తయారీకి ఖర్చుచేశారు. వలస కార్మికుల సంక్షేమం కోసం రూ.వెయ్యి కోట్ల నిధులను ఖర్చుచేయగా.. మరో రూ.100 కోట్లను వాక్సిన్ తయారీ పరిశోధనలకు కేటాయించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేవలం 47వేల వెంటిలేటర్లే ఉన్నాయి. కానీ పీఎం కేర్స్‌తో అదనంగా ఒకేసారి 50వేల వెంటిలేటర్లను సమకూర్చుకోగలిగామని అఖిలేష్ మిశ్రా ట్విటర్ థ్రెడ్‌లో పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి నేషన్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నిధులను కోవిడ్ వంటి పరిస్థితుల్లో ఉపయోగించుకోలేమని అఖిలేష్ మిశ్రా తెలిపారు. అందుకే పీఎం కేర్స్ రూపంలో ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారని వెల్లడించారు.

కాంగ్రెస్ హయాంలో PMNRFని సృష్టించారు. ఆ బోర్డులో కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కు శాశ్వత సభ్యుడి హోదా కల్పించారు. అంటే ప్రస్తుతం సోనియా గాంధీ ఉన్నారు. కాంగ్రెస్ నేత రామేశ్వర్ ఠాకూర్ శాశ్వత ఆడిటర్‌‌గా ఉన్నారు. పీఎం కేర్స్ ఆడిటింగ్ బాధ్యతను M/s SARC కు అప్పగించారని.. ఆ సంస్థకు బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. కానీ అదే సంస్థ 2018-19 PMNRF నిధులను ఆడిటింగ్ చేసింది. M/s SARCకి చెందిన సునీల్ గుప్తాను బీజేపీ మనిషిగా చెబుతున్నారు. కానీ ఆయన చాలా మంది కాంగ్రెస్ నేతలతో ఫొటోలు దిగారు. అంటే వారితోనూ సంబంధాలు ఉన్నట్లా? కోవిడ్ వంటి ఆరోగ్య సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకునేందుకే పీఎంకేర్స్‌ను మోదీ తీసుకొచ్చారు. పీఎం కేర్స్ బోర్డులో ఏ రాజకీయ నాయకుడికి సభ్యత్వం ఉండదు.
అఖిలేష్ మిశ్రా


కాగా, పీఎం కేర్స్‌పై సోనియా గాంధీ సహా చాలా మంది తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కర్నాటకలోని శివమొగ్గలో ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ హయంలో PMNRF నిధులను ఆ పార్టీ నేతలు పక్కదారి పట్టించారని.. కానీ పీఎం కేర్స్‌ను పారదర్శకతతో నిర్వహిస్తున్నామని బీజేపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్కచెబుతున్నామని స్పష్టం చేశారు.
First published: June 15, 2020, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading