AISHWARYAA RAJINIKANTH ADMITTED TO HOSPITAL AFTER TESTS POSITIVE FOR COVID 19 AMID DIVORCE FROM DHANUSH MKS
Aishwarya Rajinikanth: ఆసుపత్రిలో చేరిన ధనుష్ మాజీ భార్య.. భారమైన వ్యాఖ్యలు..
ఆస్పత్రిలో ఐశ్వర్య
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, విలక్షణ నటుడు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఏడాది (2022) నాకింకా ఏమేమి ఇవ్వబోతోందో.. అంటూ భారమైన వ్యాఖ్యలతో పోస్ట్ పెట్టారు..
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, విలక్షణ నటుడు ధనుష్ మాజీ భార్య, నిర్మాత ఐశ్వర్య రజనీకాంత్ ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయాన్ని బుధవారం ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ ఏడాది (2022) నాకింకా ఏమేమి ఇవ్వబోతోందో.. అంటూ భారమైన వ్యాఖ్యలతో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారామె. తాజా పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు ఐశ్వర్య ఆస్పత్రి అడ్మిట్ అయ్యారు..
‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా వచ్చింది. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి. ఓ 2022.. నా కోసం ఇంకా ఏమేమి తీసుకొస్తావో చూస్తా..’అంటూ ఐశ్వర్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Mystery: అనంతపురం అమ్మాయిలు.. కడపలో ఘోరం.. వాళ్లు ప్రాణస్నేహితులని పేరెంట్స్‌కు తెలీదు!
కాగా కొన్ని రోజుల కిందటే ధనుష్‌కి సైతం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. అంతకుమందు ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్, ఆయన సతీమణి గీతాంజలి కూడా వైరస్ బారిన పడ్డారు. కోలీవుడ్ లో సెలబ్రిటీ కపుల్ గా గుర్తింపు పొందిన ఐశ్వర్య- ధనుష్ గత నెలలో విడాకులు తీసుకోవడం తెలిసిందే.
దక్షిణాదిలో కేరళ తర్వాత తమిళనాడులో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. తమిళనాడులో నిన్న ఒక్కరోజే 16,096 కొత్త కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. కొవిడ్ నేపథ్యంలో తమిళనాడులో పలు ఆంక్షలు అమలవుతున్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.