విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్... క్యాన్సిల్ టికెట్లకు ఫుల్ రీఫండ్...

లాక్ డౌన్ సమయంలో విమాన టికెట్లు ప్రయాణాలు రద్దు అయిన వారికి టికెట్ల మీద ఫుల్ రీఫండ్ చేయాలని డీజీసీఏ ఆదేశించింది.

news18-telugu
Updated: April 16, 2020, 5:58 PM IST
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్... క్యాన్సిల్ టికెట్లకు ఫుల్ రీఫండ్...
మరిన్ని వివరాల కోసం 0124 2641407/02026231407/18602331407 ఫోన్ నెంబర్లలో కూడా సంప్రదించవచ్చు
  • Share this:
లాక్ డౌన్ కాలంలో విమాన ప్రయాణ టికెట్లు బుక్ చేసుకున్న వారికి విమానాలు రద్దు కావడంతో వారి టికెట్లసొమ్మును మొత్తం తిరిగి ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేట్ విమానయాన సంస్థలకు డిప్యూటీ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు తొలి విడుత, ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు రెండో విడుతగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసింది. ఈ సమయంలో కొందరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. అందులో కొందరు డొమెస్టిక్, మరికొందరు అంతర్జాతీయ టికెట్లను బుక్ చేసుకున్నారు. లాక్ డౌన్ వల్ల విమాన సర్వీసులు రద్దు కావడంతో వారికి టికెట్ల డబ్బులు రీఫండ్ చెల్లింపు విషయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. తాము చెల్లించిన మొత్తం రీఫండ్ చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేశారు. అయితే, అందులో సర్వీస్ చార్జీలు, లెవీ కింద కొన్ని కటింగ్స్ చేయాలని ఎయిర్‌లైన్స్ నిర్ణయించారు. ఈ క్రమంలో డీజీసీఏ విమానయన సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. టికెట్లు రద్దు చేసుకుంటూ అభ్యర్థించిన మూడు వారాల్లో వారికి ఫుల్ రీఫండ్  చేయాలని ఆదేశించింది.

రద్దయిన టికెట్లపై ఫుల్ రీఫండ్ చేయాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశం


సాధారణంగా విమాన చార్జీలు అంటే కొంచెం పెద్దమొత్తంలోనే ఉంటాయి. అదే, అంతర్జాతీయ విమాన సర్వీసులు అంటే ఇంకొంచెం ఎక్కువే ఉంటాయి. అసలే ప్రయాణాలు రద్దయి పాసింజర్లు తలపట్టుకుంటుంటే, మరోవైపు రకరకాల పేర్లుచెప్పి విమానయాన సంస్థలు టికెట్ల డబ్బుల్లో కోత పెట్టడంపై ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 16, 2020, 5:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading