Home /News /coronavirus-latest-news /

AHMEDABAD POLICE HAVE FILED A CASE AGAINST A DOG BIRTHDAY PARTY OWNER FOR VIOLATING COVID RULES AND GIVING HIM A GIFT SNR

గ్రాండ్‌గా కుక్క బర్త్ డే పార్టీ..వీడియో వైరల్‌ కావడంతో యజమానికి తప్పని తిప్పలు..

PHOTO CREDIT:YOUTUBE

PHOTO CREDIT:YOUTUBE

Ahmedabad: థర్డ్‌వేవ్‌ ప్రభావంతో మనుషుల ప్రాణాలకే గ్యారెంటీ లేదు. కానీ అహ్మదాబాద్‌లో కుక్క పుట్టినరోజును ఘనంగా నిర్వహించాడు ఓ యువకుడు. ఫంక్షన్‌లో ఎక్కడా కరోనా నిబంధనలు పాటించకపోవడంతో యజమానిపై కేసు పెట్టి గిఫ్ట్ ఇచ్చారు గుజరాత్‌ పోలీసులు. మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
దేశ వ్యాప్తంగా మృత్యువు వైరస్ రూపంలో ముంచుకొస్తున్నా..కొందరు వెర్రి చేష్టలు మానడం లేదు. వేల సంఖ్య నుంచి లక్షల్లో కరోనా (Corona), ఒమిక్రాన్ (Omicron)పాజిటివ్ (Positive)కేసులు నమోదవుతున్నాయి. థర్డ్‌వేవ్‌(Third wave)దెబ్బకు చాలా రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ (Night curfew)అమలు చేస్తున్నాయి. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో వివాహాలు,వేడుకలకు ప్రత్యేక ఆంక్షలు పెట్టాయి అక్కడి ప్రభుత్వాలు. ఇదంతా చూస్తూనే పెంపుడు జంతువు కోసం కష్టాల్ని కోరి తెచ్చుకున్నాడో యువకుడు. శునకానందాన్ని పొంది వివాదాల్లో చిక్కుకున్నాడు. గుజరాత్‌(Gujrat)లోని అహ్మదాబాద్‌(Ahmedabad)లో ఈ వెరైటీ ఇన్సిడెంట్‌ జరిగింది. చిరాగ్‌ (Chirag) అలియాస్‌ (Alias Dago Patel) డాగో పటేల్‌ తన పెంపుడు కుక్క పుట్టిన రోజును ఓ గ్రాండ్‌ ఈవెంట్‌గా సెలబ్రేట్ చేశాడు. కుక్క పుట్టిన రోజును వేడుకగా చేయడం అంటేనే అంతా నవ్వుకుంటారు. అలాంటిది డాగో పటేల్‌ (Dago Patel)మాత్రం అంతకు మించి అన్నట్లుగా తన పెట్‌ డాగ్‌ బర్త్‌డేని ఓ పెళ్లి వేడుకలా నిర్వహించాడు. కుక్క పుట్టిన రోజును వేడుకగా నిర్వహించడమే కాకుండా కరోనా నిబంధనల్ని ఏమాత్రం పాటించకుండా తన పొరుగున ఉంటున్న వాళ్లకు ఇబ్బంది కలిగించాడు. కుక్క పుట్టిన రోజు వేడుకను ఎక్కడో ఊరి చివర, ఫామ్‌ హౌస్‌లోనో పెట్టుకుంటే ఎవరూ ప్రశ్నించే వాళ్లు కాదు. కానీ డాగో పటేల్‌ కుక్క పుట్టిన రోజు వేడుకల్ని మధువన్ గ్రీన్‌ పార్టీ ఫ్లాట్‌ (Madhuvan Green Party Plot)లో నిర్వహించడంతో రచ్చరచ్చైంది.

ఇదో టైపు శునకానందం ..
అబ్బే పేరుతో ముద్దుగా పిలుచుకునే కుక్క పుట్టిన రోజు వేడుకను డాగో పటేల్‌ ఓ పెళ్లికి చేసినంత హడావుడి చేశాడు. భారీ ఫ్లెక్సీలు, ఫంక్షన్‌లో లైంటింగ్, వెల్కమ్‌ బోర్డులు, వీటితో పాటు డీజే మ్యూజిక్, గానా,భజానా ఒకటేంటి చేయాల్సిన ఎక్స్‌ట్రాలన్ని చేశాడు. ఇక బర్త్‌డేకి పిలిచిన వ్యక్తే ఇలా వ్యవహరిస్తే...ఈ వేడుకకు వచ్చిన వాళ్లు కూడా అంతే బాద్యతారాహిత్యంగా నడుచుకున్నారు. ఏ ఒక్కరూ మాస్క్‌ ధరించలేదు. భౌతికదూరం పాటించలేదు. ఎక్కడా శానిటైజర్‌ బాటిళ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో డాగో పటేల్ సెలబ్రేట్ చేసిన కుక్క బర్త్ డే వీడియో వైరల్ అయింది. అది కాస్తా పోలీసుల వరకూ చేరడం మనోడికి సీన్‌ సితారైంది.

డాగ్‌ బర్త్‌ డేకి పోలీసులిచ్చిన గిఫ్ట్..
కుక్క పుట్టిన రోజును ఘనంగా నిర్వహించడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ కోవిడ్‌ నిబంధనల్ని పూర్తిగా తుంగలో తొక్కి ఫంక్షన్‌ నిర్వహించిన విధానంపైనే అధికారులు, చుట్టు పక్కల వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పార్టీని నిర్వహించిన డాగో పటేల్‌తో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిపై కోవిడ్‌19 రూల్స్ ఉల్లంఘన కేసు పెట్టారు. జంతువులపై ప్రేమ చూపిస్తే వద్దని చెప్పము..కానీ పరిస్థితులు బాగోలేనప్పుడు కాస్త విచక్షణతో వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Birthday, Coron cases, Dog, Police Case

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు